Punjab Lottery: ఆమెకు అదృష్టం తలుపుతట్టింది.. రాత్రికి రాత్రే కోటీశ్వరాలుగా మారింది..
Punjab Housewife Wins ₹ 1 Crore From Lottery: ఆమె ఒక సాధారణ గృహిణి.. ఆమె భర్త చిన్న దుస్తుల దుకాణం నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. రోజూ కష్టపడితే గానీ వారి ఇల్లు గడవని పరిస్థితి. అలాంటి ఓ మహిళ జీవితం రాత్రికి రాత్రే..
Punjab Housewife Wins ₹ 1 Crore From Lottery: ఆమె ఒక సాధారణ గృహిణి.. ఆమె భర్త చిన్న దుస్తుల దుకాణం నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. రోజూ కష్టపడితే గానీ వారి ఇల్లు గడవని పరిస్థితి. అలాంటి ఓ మహిళ జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. అదృష్టం ఆమె తలుపుతట్టింది. కట్‌చేస్తే ఆమె రాత్రిరాత్రే కోటీశ్వరురాలిగా మారింది. వంద రూపాయలు పెట్టి ఆమె కొన్న టికెట్‌కు కోటి రూపాయల లాటరీ తగలడంతో సాధారణ కుటుంబం సంతోషంలో మునిగితేలుతోంది. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో చోటు చేసుకుంది.
వివరాలిలా.. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌కి చెందిన రేణూ చౌహాన్ 100 రూపాయలతో ఇటీవల ప్రభుత్వానికి చెందిన ఓ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. ఆ లాటరీకి సంబంధించిన డ్రాను అధికారులు ఫిబ్రవరి 11న తీశారు. ఆ డ్రాలో రేణూ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ D-12228కు మొదటి బహుమతి తగిలింది. దీంతో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం రేణూ చౌహాన్‌ను విజేతగా ప్రకటించింది. ప్రైజ్ మనీ పొందేందుకు కావాల్సిన డాక్యుమెంట్లను రాష్ట్ర లాటరీస్ శాఖలో రేణూ గురువారం సమర్పించింది. త్వరలోనే ఆమెకు కోటి రూపాయల నగదు చేరుతుందని రాష్ట్ర లాటరీ శాఖ అధికారి వెల్లడించారు.
ఈ సందర్భంగా రేణూ చౌహాన్ కుటుంబం సంతోషంలో మునిగితేలుతోంది. లాటరీ డాక్యుమెంట్లను సమర్పించిన అనంతరం రేణూ చౌహాన్ మాట్లాడుతూ.. భగవంతుడి ఆశీస్సులతోనే తనకు లాటరీ తగిలిందని ఆనందం వ్యక్తం చేశారు. తమ కుటుంబం సంతోషంగా జీవించేందుకు ఈ నగదు ఎంతో ఉపయోగపడుతుందని ఆమె వెల్లడించారు.
Also Read: