కీబోర్డు టైప్ చేస్తుంటే కీళ్ల నొప్పి వేధింస్తుందా ? ఈ సింపుల్ హ్యాండ్ ఎక్సర్‏సైజ్ చేసి చూడండి..

చాలా మందికి కొన్నిసార్లు మోచేతి నొప్పి వస్తుంది. ఇక ఉద్యోగాలు చేసేవారికి ఈ బాధ మరీ ఎక్కువగా వేదిస్తుంటుంది. ముఖ్యంగా కంప్యూటర్ టైప్ చేసే సమయంలో ఈ

కీబోర్డు టైప్ చేస్తుంటే కీళ్ల నొప్పి వేధింస్తుందా ? ఈ సింపుల్ హ్యాండ్ ఎక్సర్‏సైజ్ చేసి చూడండి..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 25, 2021 | 2:16 PM

చాలా మందికి కొన్నిసార్లు మోచేతి నొప్పి వస్తుంది. ఇక ఉద్యోగాలు చేసేవారికి ఈ బాధ మరీ ఎక్కువగా వేదిస్తుంటుంది. ముఖ్యంగా కంప్యూటర్ టైప్ చేసే సమయంలో ఈ నొప్పి తీవ్రంగా ఉంటుంది. అయితే దానిని నియంత్రించడానికి ఎక్కువగా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. ఇక ఇది ఎక్కువ రోజుల తరబడి బాధిస్తుంటే మెడికల్ అటెన్షన్ కావాల్సి వస్తుంది. అయితే సుదీర్ఖకాలం నుంచి ఈ నొప్పిని అనుభవించే వారు ముందుగా డాక్టర్స్‏ను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక దీనిని మరీ ఎక్కువగా కాకముందే సింపుల్ ఎక్సర్ సైజ్ చేస్తూ ఈ నొప్పిని నియంత్రణలో పెట్టవచ్చు. అదేలాగో చూద్దాం.

ముందుగా గుప్పెట మూసి తెరవడం అన్న సింపుల్ ఎక్సర్ సైజ్ కూడా అలసిపోయిన కండరాలకి రిలాక్సేషన్ ఇస్తుంది. ఈ ప్రాక్టీస్ కోసం స్ట్రెస్ బాల్స్ కూడా ఉపయోగించవచ్చు. ఇలా రోజుకి వందసార్లు చేయాలి. మీ చేతి వేళ్ళన్నీ దగ్గరకి తెచ్చి తెరవాలి. ఇలా చేయడం వలన లింబ్స్ లో రేంజ్ ఆఫ్ మోషన్ పెరుగుతుంది. ఇలా రోజు యాబై నుంచి వందసార్లు చేయాలి. ఒక బాల్ లేదా గుండ్రంగా ఉండే పండు తీసుకొని దాన్ని మీ అరచేతులు కిందకి పెట్టి పట్టుకోండి. ఇప్పుడు నెమ్మదిగా కిందకి పట్టుకోవాలి. ఇలా యాభై సార్లు చేయాలి. మీ చేతి వేళ్ళని లెక్కపెట్టండి. ఇంత సింపుల్ ఎక్సర్సైజ్ కూడా వేళ్ళ వద్ద మొబిలిటీని పెంచుతుంది. ఇలా రోజుకుకి ఇరవై సార్లు చేయండి. ఇదే పని అర చేతులు పైకి పెట్టి కూడా చేయండి. ఇప్పుడు ఇంకొంచెం పైకి పట్టుకోండి. ఇలా రోజుకి యాభై సార్లు చేయండి. ఇందు వల్ల ముంజేతులు బలంగా తయారవుతాయి.

కుర్చీలో కూర్చుని మీ అరచేతులని టేబుల్ లేదా డెస్క్ కిందుగా ఉంచండి. ఇప్పుడు టేబుల్‏కి మీ అరచేతులని ప్రెస్ చేయండి. ఐదు నుండి పది సెకన్ల పాటు చేస్తే క్రమంగా నొప్పి తగ్గుతుంది. గుప్పెట మూసి బొటన వేలు పైకెత్తండి, థంప్స్ అప్ సిగ్నల్ లాగా. బొటన వేలు కదలకుండా రెసిస్టెన్స్ ఇవ్వండి. ఇప్పుడు రెండవ చేతితో నెమ్మదిగా బొటన వేలిని వెనక్కి లాగండి. హోల్డ్ చేసి రిపీట్ చేయండి. గుప్పెట మూసి బొటన వేలు పైకెత్తండి, థంప్స్ అప్ సిగ్నల్ లాగా. బొటన వేలు కదలకుండా రెసిస్టెన్స్ ఇవ్వండి. ఇప్పుడు రెండవ చేతితో నెమ్మదిగా బొటన వేలిని ముందుకు తోయండి. హోల్డ్ చేసి రిపీట్ చేయండి.

మీ రెండు అరచేతులూ నమస్కారం చేస్తునట్లుగా ఉంచండి. మీ మోచేతులు కూడా ఒకదాన్నొకటి తాకుతూ ఉండేలా ఉంచండి. మీ వేలి చివరల వద్ద నుండి మోచేయి వరకూ మీ చేతులు ఒక దానొకటి తాకుతూ ఉండాలి. ఇప్పుడు మీ అర చేతులు దగ్గరా ఉంచి మీ మోచేతులని దూరం జరపండి. ఇలా చేస్తున్నప్పుడు మీ చేతులని కిందకి దించండి. మీ బెల్లీ బటన్ వరకూ మీ చేతులు వచ్చాక ఆపేయండి. ఇలా పది నుండి ముప్ఫై సెకన్ల పాటు ఉండండి. రిపీట్ చేయండి. ఒక చేతిని మీ భుజాల ఎత్తులో చాచండి. అర చేయి నేలని చూస్తూ ఉండాలి. ఇప్పుడు ముంజేతిని రిలీజ్ చేయండి, అంటే మీ వేళ్ళు నేల వైపు ఉంటాయి. రెండవ చేతితో ఈ చేతి వేళ్ళని పట్టుకుని మృదువుగా మీ బాడీ వైపు లాగండి. ఇలా పది నుండి ముప్ఫై సెకన్లు ఉంచండి.

Also Read:

మానసిక ఒత్తిడికి గురవుతున్నారా ? వీటిని రోజూవారీ డైట్‏లో తీసుకోవడం వలన ఆందోళన తగ్గిస్తాయి.. అవెంటంటే..