ఆస్ట్రేలియాలో ఇక వెల్లువెత్తనున్న ఫేస్ బుక్, గూగుల్ పెట్టుబడులు, కొత్త చట్టానికి పార్లమెంట్ అనుమతి

ఆస్టేలియా పార్లమెంట్ నూతన మీడియా చట్టాన్ని ఆమోదించింది. లోకల్ న్యూస్ కంటెంట్ డీల్స్ లో ఫేస్ బుక్, గూగుల్ కోట్లాది డాలర్లను పెట్టుబడి పెట్టడానికి మార్గాన్ని సుగమం చేసేందుకు ఉద్దేశించిన ఈ చట్టానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.

  • Updated On - 2:23 pm, Thu, 25 February 21 Edited By: Anil kumar poka
ఆస్ట్రేలియాలో ఇక వెల్లువెత్తనున్న ఫేస్ బుక్, గూగుల్ పెట్టుబడులు, కొత్త చట్టానికి పార్లమెంట్ అనుమతి

ఆస్టేలియా పార్లమెంట్ నూతన మీడియా చట్టాన్ని ఆమోదించింది. లోకల్ న్యూస్ కంటెంట్ డీల్స్ లో ఫేస్ బుక్, గూగుల్ కోట్లాది డాలర్లను పెట్టుబడి పెట్టడానికి మార్గాన్ని సుగమం చేసేందుకు ఉద్దేశించిన ఈ చట్టానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రపంచ వ్యాప్తంగా రెగ్యులేటర్లతో గల సమస్యల పరిష్కారానికి ఈ కొత్త చట్టం తోడ్పడనుంది. ‘న్యూస్ మీడియా అండ్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మ్యాండేటరీ బార్గెయినింగ్ కోడ్’ అని ఈ లా ను వ్యవహరిస్తున్నారు. లోకల్ మీడియా కంపెనీలకు చెల్లింపులు జరపాలన్న నిబంధనను, ఈ సంస్థలు మొదట తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ ఈ నూతన చట్టం కారణంగా పరిస్థితి మారింది. లోకల్  కంటెంట్ డీల్స్  సందర్భంగా ఆయా కంపెనీలకు ఈ సంస్థలు కోట్లాది డాలర్లను చెల్లించాలని ఇది నిర్దేశిస్తోంది. తన ‘షో కేస్’ ప్రాడక్ట్ పై ప్రచురించే న్యూస్ కి గూగుల్, తన ‘న్యూస్’ ప్రాడక్ట్ పై పబ్లిష్ చేసే న్యూస్ కి ఫేస్ బుక్ చెల్లింపులు జరపనున్నాయి. ఈ సంవత్సరాంతంలో ఈ ‘న్యూస్’ ప్రాడక్ట్ ని ఫేస్ బుక్ ప్రారంభించనుంది. సామాజిక మాధ్యమాల్లో న్యూస్ ప్రచురించేందుకు  సంబంధిత కంటెంట్ పై మీడియా సంస్థలకు డబ్బు చెల్లించాలనే ప్రతిపాదనను ఆస్ట్రేలియా లోగడ రూపొందించింది. తరువాత దీన్ని బిల్లుగా మార్చింది. తొలుత ఈ రెండు సంస్థలు దీన్ని వ్యతిరేకించాయి. పర్యవసానంగా ఆస్ట్రేలియాలో వార్తలను తన సామాజికవేదికపై షేర్ చేసుకోవడాన్ని ఫేస్ బుక్ నిలిపివేసింది.  దీంతో ఆస్ట్రేలియన్లు ఆందోళన చెందారు. ప్రభుత్వ నిబంధనలు ఏక పక్షంగా ఉన్నాయని కూడా ఆ మధ్య ఫేస్ బుక్ ఆరోపించింది. అయితే ఆ తరువాత సదరు నిబంధనలను ప్రభుత్వం సవరించింది.

దీంతో మంగళవారం నుంచి ఫేస్ బుక్ ఈ దేశంలో వార్తలు షేర్ చేసుకునే ప్రక్రియను పునరుధ్దరించింది. లోకల్ మీడియా కంపెనీలతో కోట్లాది  డాలర్ల విలువైన డీల్స్ ని గూగులిడివరకే కుదుర్చుకుంది.  ఈ కంపెనీల్లో రూపర్ట్ ముర్డోచ్ నేతృత్వంలోని న్యూస్ కార్పొరేషన్, నైన్ ఎంటర్ టైన్  మెంట్ వంటి సంస్థలు ఉన్నాయి. అటు-తాను ఈ దేశంలోని సెవెన్ వెస్ట్ అనే మీడియా సంస్థతో తొలి ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు ఫేస్ బుక్ ప్రకటించింది.  రానున్న మూడేళ్ళలో ప్రపంచ వ్యాప్తంగా తాము దాదాపు రూ. 7,230 కోట్ల చొప్పున పెట్టుబడిగా పెడతామని ఫేస్ బుక్, గూగుల్ ప్రకటించాయి.

కాగా కొత్త చట్టంతో ఇకపై ఫేస్ బుక్ బాటు గూగుల్ కూడా తమ  వేదికల్లో ప్రచురించే వార్తలకు గాను దేశ మీడియా సంస్థలకు చెల్లింపులు జరపాల్సి ఉంటుందని ఆస్ట్రేలియా కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పాల్ ఫ్లెచర్ తెలిపారు. మూడేళ్ళ పటు జరిపిన విస్తృత చర్చలు, విశ్లేషణ జరిపిన అనంతరం నూతన కోడ్ తెచ్చేందుకు తాము ముందడుగు వేశామని ఆయన పేర్కొన్నారు. అటు-ఇదే తరహాలో బ్రిటన్, కెనడా కూడా ఈ విధమైన బిల్లులు తేవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.  మొత్తానికి ఈ మధ్య ముఖ్యంగా ఫేస్ బుక్, ఆస్ట్రేలియా ప్రభుత్వం మధ్య తలెత్తిన సమస్య పరిష్కారమైంది. ఒక దశలో ప్రధాని  స్కాట్ మారిసన్ కూడా తన సొంత ఫేస్ బుక్ పేజ్ పై ..ఫేస్ బుక్ తీరును తీవ్రంగా విమర్శించారు. సమస్య పరిష్కారానికి తాము అన్వేషిస్తుంటే దేశంలో న్యూస్ కంటెంట్ ని నిలిపివేస్తామంటూ ఈ వేదిక హెచ్చరించడం సరికాదని ఆయన అన్నారు. ఏమైనా ఆస్ట్రేలియా ధనిక దేశం గనుక దిగ్గజాలు రెండూ దిగివచ్చినట్టు కనిపిస్తోంది. ముందు చూపుతూనే తాజా నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు.

 

Read Also..

ప్రధాని మోదీ రాకకు తమిళనాడు సకల ఏర్పాట్లు.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం.. ప్రత్యేక కమెండోలతో భద్రత కట్టుదిట్టం..!