భారత్ – ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రుల భేటి.. పలు ద్వైపాక్షిక సంబంధాలపై ఒప్పందం

India - Uzbekistan: భారత్-ఉజ్బెకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు మధ్య గురువారం ఒప్పందం జరిగింది. దీనిలో భాగంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు బహుపాక్షిక సంబంధాలపై..

భారత్ - ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రుల భేటి.. పలు ద్వైపాక్షిక సంబంధాలపై ఒప్పందం
Follow us

|

Updated on: Feb 25, 2021 | 4:08 PM

India – Uzbekistan: భారత్-ఉజ్బెకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు మధ్య గురువారం ఒప్పందం జరిగింది. దీనిలో భాగంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు బహుపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ మేరకు గురువారం ఉదయం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఉజ్బెకిస్తాన్‌ విదేశాంగ మంత్రి అబ్దుల్ అజీజ్ కమిలోవ్‌.. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చజరిగింది. అభివృద్ధి, రక్షణ రంగం, కనెక్టివిటీ, వాణిజ్యం, సంస్కృతి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు జైశంకర్ తెలిపారు. దీంతోపాటు ఆఫ్ఘానిస్తాన్ పరిస్థితిపై కూడా ఇరు దేశాలు అభిప్రాయాలు పంచుకున్నాయని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఉజ్బెకిస్తాన్‌ విదేశాంగ మంత్రి అబ్దుల్ అజీజ్ కమిలోవ్‌ను స్వాగతిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ జైశంకర్ పేర్కొన్నారు. ఇరు దేశాలు కూడా బహుపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు అంగీకరించాయని జైశంకర్ తెలిపారు. కాగా.. కమిలోవ్ రెండు రోజుల పర్యటన కోసం ఆయన బుధవారం భారత్‌కు చేరుకున్నారు. గురువారం సాయంత్రం కమిలోవ్ తాష్కెంట్‌కు బయలుదేరనున్నారు.

కాగా అంతకుముందు గతేడాది డిసెంబర్ 11న ప్రధాని నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు శావ్‌కట్ మిర్జియోయెవ్ వర్చువల్ విధానంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య పునరుత్పాదిత ఇంధనం, డిజిటల్, సైబర్ టెక్నాలజీ, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు, వస్తు రవాణా, సమాచార మార్పిడి వంటి రంగాల్లో మొత్తం 9 ఒప్పందాలు కుదిరాయి. అలాగే, ఉజ్బెకిస్తాన్‌లో అభివృద్ధి కార్యక్రమాల కోసం భారత్ 44.8 కోట్ల డాలర్ల రుణాన్ని అందించేందుకు అంగీకరించింది.

Also Read:

ఆస్ట్రేలియాలో ఇక వెల్లువెత్తనున్న ఫేస్ బుక్, గూగుల్ పెట్టుబడులు, కొత్త చట్టానికి పార్లమెంట్ అనుమతి

ట్రంప్ మరో ఆర్డర్ బుట్టదాఖలు, గ్రీన్ కార్డు కోరుతున్నవారిపై బ్యాన్ ఎత్తివేసిన అధ్యక్షుడు జోబైడెన్

ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు