ట్రంప్ మరో ఆర్డర్ బుట్టదాఖలు, గ్రీన్ కార్డు కోరుతున్నవారిపై బ్యాన్ ఎత్తివేసిన అధ్యక్షుడు జోబైడెన్

అమెరికాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ జయాల్లో జారీ చేసిన ఉత్తర్వుల్లో మరొకదాన్ని అధ్యక్షుడు జోబైడెన్ బుట్టదాఖలు చేశారు.

ట్రంప్ మరో ఆర్డర్ బుట్టదాఖలు, గ్రీన్ కార్డు కోరుతున్నవారిపై బ్యాన్ ఎత్తివేసిన అధ్యక్షుడు జోబైడెన్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 25, 2021 | 12:29 PM

అమెరికాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ జయాల్లో జారీ చేసిన ఉత్తర్వుల్లో మరొకదాన్ని అధ్యక్షుడు జోబైడెన్ బుట్టదాఖలు చేశారు. తాజాగా అమెరికాలో ప్రవేశించగోరి.. గ్రీన్ కార్డులకోసం దరఖాస్తు చేసినవారిపై గల నిషేధాన్ని ఆయన ఎత్తివేశారు. దేశంలో ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న యువతను కాపాడాలంటే ఈ నిషేధం అవసరమంటూ ట్రూప్ గత ఏడాది ఈ బ్యాన్ విధించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. కానీ ఈ కారణాన్ని బైడెన్ తోసిపుచ్చుతూ వీసా బ్యాన్ ఉత్తర్వులను ఉపసంహరించారు. అమెరికాలో ఉన్న తమ కుటుంబాలను, బంధువులను కలుసుకునేందుకు ఈ నిషేధం అడ్డుగా ఉందని, ఇది దేశంలో వ్యాపార కార్యకలాపాలకు  చేటు తెచ్చే దిగా కూడా ఉందని బైడెన్ వ్యాఖ్యానించారు. ట్రంప్ తెచ్చిన పలు ఇమిగ్రేషన్ విధానాలను మార్చివేస్తామని ఆయన గతంలోనే ప్రకటించారు. వీసా బ్యాన్ కాల పరిమితి వచ్ఛే మార్చి  31 తో ముగియాల్సి ఉంది. విదేశీ తాత్కాలిక వర్కర్లపై గల మరో బ్యాన్ ని కూడా బైడెన్ రద్దు చేశారు. ఈ వర్కర్లపై లోగడ ట్రంప్ విధించిన బ్యాన్ దేశంలోని వేలాది బిజినెస్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపిందని గత ఏడాది అక్టోబరులోనే కాలిఫోర్నియాలోని ఫెడరల్ జడ్జ్ ఆ బ్యాన్ అమలుకాకుండా నిలిపివేశారు.

కరోనా వైరస్ పాండమిక్ కారణంగా అనేక వీసా ప్రాసెసింగ్ దరఖాస్తులు నెలలతరబడి కుప్పలు, తెప్పలుగా పేరుకుపోయాయని, వాటిని నూతన అధ్యక్షుడు బైడెన్ పరిష్కరించాల్సి ఉందని కాలిఫోర్నియా లోని ఇమిగ్రేషన్ అటార్నీ కర్టిస్ మారిసన్ పేర్కొన్నారు. వీటిని ప్రాసెస్ చేసి పరిష్కరించడానికి కొన్ని సంవత్సరాలైనా పట్టవచ్చుఅన్నారాయన. మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఈ గోల అంతా ఈ దేశం మీద పెట్టి వెళ్లాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇమిగ్రేషన్ సిస్టాన్ని మొత్తం ట్రంప్ నీరు గార్చాడని కూడా మండిపడ్డారు.

ఇలా ఉండగా నూతన ఇమిగ్రేషన్ బిల్లును బైడెన్ ప్రభుత్వం కాంగ్రెస్ లో ప్రవేశపెట్టింది. దీన్ని యూఎస్ సిటిజెన్ షిప్ యాక్ట్-2021 అని వ్యవహరిస్తున్నారు. సెనెటర్ రాబర్ట్ మెనెండెజ్, రిప్రజెంటేటివ్ లిండా సాంచెజ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కింద అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలనుకునేవారికీ మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. వారు ఇదివరకు మాదిరి గ్రీన్ కార్డుకోసం ఎక్కువకాలం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. అలాగే వారి పిల్లలు కూడా మహా అయితే ఎనిమిదేళ్లు వేచి ఉంటే సరిపోతుంది. పైగా హెచ్-1 బీ వీసా హోల్డర్లలో భార్య లేదా భర్తకు కూడా ఏ యాక్ట్ వల్ల ప్రయోజనం కలుగుతుంది. వారి జాబ్ పై ఇది ఎలాంటి ప్రభావం చూపబోదు. ఇక అమెరికా-మెక్సికో బోర్డర్లో గోడ నిర్మాణానికి సంబంధించి గతంలో ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులపై కూడా బైడెన్ దృష్టి పెట్టనున్నారు. ఆ గోడ నిర్మాణానికి ట్రంప్ కోట్లాది డాలర్ల వ్యయాన్ని నిర్దేశించారు. ఆ సొమ్మును దేశ అభివృద్ధికార కార్యకలాపాలకు వినియోగించాలని జోబైడెన్ భావిస్తున్నారు. వృధా వ్యయాన్ని అరికట్టి ,ముఖ్యంగా దేశంలో కరోనా వైరస్ అదుపునకు, యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలకు కృషి చేసేందుకు  వినియోగించాలన్నది బైడెన్ లక్ష్యంగా కనిపిస్తోంది. తాను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా వివిధ ప్రజా సంక్షేమ చర్యలను వేగవంతం చేయాలని ఆయన కోరుతున్నారు. ఇప్పటికే ట్రంప్ ఉత్తర్వుల్లో పలు ఆర్దర్లకు ఆయన మంగళం పాడారు.. సెనేట్ లో గానీ, ప్రతినిధుల సభలో గానీ ఇప్పుడు డెమొక్రాట్లదే పైచేయిగా ఉంది. పైగా రిపబ్లికన్లలో కూడా చాలామంది బైడెన్ ప్రభుత్వ విధానాలకు మద్దతు ప్రకటిస్తుండడం విశేషం.

మరిన్ని చదవండి ఇక్కడ :

భాగ్యనగర వాసులను హడలెత్తించిన వీడియో.. బాలానగర్ ఫ్లైఓవర్ కుప్పకూలిందా..?:Balanagar flyover mishap viral video

నరసరావుపేట డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య :Narasaraopet Degree Student Murder video

 

Latest Articles