అమెరికాలో అతి భయానక ఘటన.. మనిషిని చంపి గుండెను బంగాళదుంపలతో కూర వండిన కిరాతకుడు
మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. రాను రాను కఠినాత్ములుగా మారుతున్నారు. స్వార్థం పెరిగి, తన మన అనే బేధం మర్చిపోతున్నారు. ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు
cooked victim heart in US : మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. రాను రాను కఠినాత్ములుగా మారుతున్నారు. స్వార్థం పెరిగి, తన మన అనే బేధం మర్చిపోతున్నారు. ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. కొన్ని రకాల నేరాలు.. వాటికి పాల్పడిన వ్యక్తుల్ని చూస్తే.. మనుషుల్లో ఇంత రాక్షసత్వం దాగి ఉంటుందా.. ఇంత క్రూరంగా.. దారుణంగా ఓ మనిషిని చంపగలరా అనే అనుమానం, భయం కలుగుతాయి. వారిని తిట్టడానికి.. వారి చేష్ట గురించి వివరించడానికి ఏ భాష సరిపోదు. తాజాగా ఇలాంటి భయానక ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అత్యంత పాశవీకంగా ఒకరిని చంపి.. గుండెని పెకిలించి.. దాన్ని కూర వండిన పైశాచిక చర్య వెలుగు చూసింది. నేరస్తుడు చెప్పిన విషయాలు విన్న పోలీసులకే వెన్నులో ఒణుకు పుట్టింది. ఓక్లహోమాలో ఈ ఘోరం చోటు చేసుకుంది.
లారెన్స్ పౌల్ ఆండర్సన్ వ్యక్తి డ్రగ్స్ కేసులో దాదాపు 20 ఏళ్ల పాటు జైలులో గడిపి కొన్ని వారాల కిందటే విడుదలయ్యాడు. ఇదే క్రమంలో రెండు వారాల క్రితం అతడు తన ఇంటి పక్కన ఉండే వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత మరణించిన వ్యక్తి గుండెని బయటకు తీసి.. దాన్ని తన అంకుల్ వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ గుండెని కోసి.. ఆలుగడ్డలతో కలిపి కూర వండాడు. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యుల చేత దాన్ని తినిపించాలని భావించాడు.
ఇతడి వికృత చేష్టలు చూసిన పౌల్ అంకుల్, అతడి కుటుంబ సభ్యులు భయపడి ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పౌల్ అతడి అంకుల్‌ని, వారి నాలుగేళ్ల కుమార్తెని అతి దారుణంగా హతమార్చాడు. అంకుల్ భార్యని చిత్రవధకు గురి చేశాడు. ఆమె పౌల్ బారి నుంచి చాకచక్యంగా తప్పించుకుని.. బయటపడగలిగింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. ఇరుగుపొరుగు వారి సహయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన ఓక్లహోమా పోలీసులు పౌల్‌ని అరెస్ట్ చేశారు. విచారణలో అతడు విస్తుపోయే అంశాలు వెల్లడించాడు.
తన అంకుల్ ఇంట్లో రాక్షసులు ఉన్నారని.. వారిని తరమడం కోసం.. గుండెని వండి వారితో తినిపించాలని భావించాను అని తెలిపాడు. కానీ వారు అంగీకరించకపోవడంతో చంపేయాల్సి వచ్చిందని తెలిపాడు. లేదంటే ఆ రాక్షసులు అంకుల్ కుటుంబాన్ని పీడించి.. వారిని ఆవహించి.. జనాలను చంపేసేవారు అని పౌల్ పోలీసులకు వివరించారు. అతని మాటలు విన్న పోలీసులు విస్తుపోయారు.
ఇదీ చదవండిః నిద్రపోండి.. రూ. 10 లక్షలు సంపాదించండి.. ఈ ఉద్యోగానికి అందరూ అర్హులే.. వివరాలివే.!