- Telugu News Photo Gallery Gold Price Drop Today: How Much Have Gold and Silver Rates Fallen in Ap and Telangana
Gold and Silver Rates: అబ్బా సాయిరాం.. ఎంత చక్కటి వార్తో.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
Gold Price Drop Today:గత కొన్ని రోజులు బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఒకానోక సందర్భంలో బంగారం ఆల్‌టైం హైకి చేరుకొని రూ.లక్షా 30వేల మార్క్ దాటింది. ఇప్పుడు కాస్త తగ్గి బంగారం కొనాలనుకునే వారికి స్వల్ప ఊరటనిచ్చింది. నిన్నటి తో పోల్చుకుంటే శనివరాం ఉదయం 11 గంటల వరకు 24 కారెట్ల బంగారం ధర తులంపై రూ.540 తగ్గింది. కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
Updated on: Dec 06, 2025 | 11:59 AM

గత కొన్ని రోజులు బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఒకానోక సందర్భంలో ఆల్‌టైం హైకి చేరుకొని రూ.లక్షా 30వేల మార్క్ దాటిన బంగారం ధరలు ఇప్పుడు కాస్త తగ్గి.. గోల్డ్ కొనాలనుకునే వారికి స్వల్ప ఊరటనిచ్చాయి. శుక్రవారంతో పోల్చుకుంటే శనివారం ఉదయం 11 గంటల వరకు తులం 24 కారెట్ల బంగారం ధరపై రూ.540, 22 కారెట్ల బంగారం ధరపై రూ.500 వరకు తగ్గింది.

తగ్గిన బంగారం రేట్ల తర్వాత శనివారం ఉదయం 11 గంటలకు మార్కెట్‌లో 24 కారెట్ల తులం బంగారం ధర రూ. 1,30,150 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,19,300 వద్ద కొనసాగుతుంది.

ఇక బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తోంది. శుక్రవారంతో పోల్చుకుంటే శనివారం కేజీ వెండి ధరపై రూ. 100 తగ్గింది. శుక్రవారం కేజీ వెండి దర రూ.1,96,000గా ఉండగా, శనివారం ఉదయం 11 గంటలకు కేజీ వెండి ధర రూ.1,95,900 గా కొనసాగుతుంది.

ఇక మన హైదరాబాద్, విజయవాడ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనే విషయాన్ని పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,150 ఉంది.. 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,19,300 ఉంది. వెండి కిలో ధర రూ.1,95,900 ఉంది. దాదాపు విజయవాడలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

ఇక కోల్‌కతా, ముంబై , బెంగళూరులోనూ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. రూ. 1,30,150గా ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,30,300, చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,31,350గా కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే కేజి వెండి ధర రూ. చెన్నైలో 1,99,000, ముంబై, కోల్‌కతా , బెంగళూరు, ఢిల్లీలో 1,90,000గా కొనసాగుతుంది.




