Donkey milk Uses and Cost : ముసలి తనం రానివ్వని గాడిద పాల స్నానం .. ఖరము పాలు, చీజ్ అత్యంత ఖరీదు

తల్లి పాలు అంత శ్రేష్టమైనవి ఆవు పాలు అనే విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఆవు పాలు కంటే కూడా ఖరం పాలు ఇంకా మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పాలలో రోగనిరోధక శక్తిని పెంచే ఔషధ గుణాలతో పాటు..

Donkey milk Uses and Cost : ముసలి తనం రానివ్వని గాడిద పాల స్నానం .. ఖరము పాలు, చీజ్ అత్యంత ఖరీదు
Follow us
Surya Kala

|

Updated on: Feb 24, 2021 | 12:05 PM

Donkey milk Uses and Cost : తల్లి పాలు అంత శ్రేష్టమైనవి ఆవు పాలు అనే విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఆవు పాలు కంటే కూడా ఖరం పాలు ఇంకా మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పాలలో రోగనిరోధక శక్తిని పెంచే ఔషధ గుణాలతో పాటు అందాన్ని పెంచే గుణం కూడా ఉందట. విటమిన్లు, ఎసెన్షియ్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం గా ఉంటాయి. ముఖ్యంగా ఆవు, గేదె పాలు తాగితే పడని పసి పిల్లలకు ఇది మంచి ప్రత్యమ్నాయం. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరం లోని కణాలను రక్షించడంలోకీలక పాత్రను పోషిస్తాయి.

పొగ, రేడియేషన్ వల్ల మన శరీరం లోకి ఫ్రీ రాడికల్ సెల్స్ ప్రవేశించి ఆరోగ్యం గా ఉన్న కణాలనుపాడు చేస్తాయి. దీంతో మనం ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నాము. ఇటువంటి పరిస్థితి రాకుండా చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్‌దే కీలక పాత్ర. శరీరం లోని కణాలనురక్షిస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్‌ గాడిద పాల లో పుష్కలం గా ఉంటాయి

ఆ గాడిద పాలను లీటర్ రూ.6,000నుండి 7000 వరకు అమ్ముతున్నారు. గాడిద పాలకు ప్రాచీన కాలం నుంచే విపరీతమైన డిమాండ్ ఉంది. ఈజిప్టు లో ఒకప్పటి అందాల రాణి క్లియోపాత్రా గాడిద పాలతో నే స్నానం చేసేదట. ఎందుకంటే ఆ పాలు ముసలితనం త్వరగా రాకుండా చెయ్యగలవు. ఈ హాలరీ గాడిదలు, గుజరాత్‌లోని సౌరాష్ట్రలో ఎక్కువగా ఉంటాయి. ఈ గాడిదలు గుర్రాల కంటే చిన్నగా ఉంటాయి. గాడిద పాలు అమృతం తో సమానమాట?? అసలు ఆ పాలు ఎంత ఖరీదో తెలుసా?

@ ఆవు పాలతో పోలిస్తే.. గాడిద పాలలో ఐదు రెట్లు తక్కువ కెసిన్, సమానస్థాయిలో ప్రొటీన్లు కలిగి ఉంటాయి. అందుకనే వీటిని తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.

@ గాడిద పాలు మానవ రొమ్ము పాలు, ఆవు పాలతో సమానమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయట. అందుకనే శిశువులకు ఇవి పట్టించడం మంచిదని అంటుంటారు.

@ వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి తాగడం వల్ల శరీరానికి కేలరీలు, విటమిన్- డి ఎక్కువగా అందుతాయి. ఇవి లాక్టోస్ రూపంలో ఉంటాయి.

@ఆర్థరైటిస్, దగ్గు జలుబు లాంటి ఇన్ఫెక్షన్లను నయం చేయడంతో పాటు గాయాలకు చికిత్స చేసేందుకు గాడిద పాలు ఉపయోగిస్తారు.

@దీంట్లోని యాంటీ-మెక్రోబయాల్ లక్షణాలు అంటువ్యాధులు, బ్యాక్టీరియా, ఇతర వైరస్లు నుంచి దూరం చేసేందుకు సహాయపడతాయి.

@ ముఖ్యంగా అలెర్జీని దూరం చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

@ గాడిద పాలు రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచే ప్రోటీన్లు సైటోకిన్‌ల విడుదలను ప్రోత్సహించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

@ గాడిద పాలు ఆహార పదార్థంగా కంటే ఎక్కువ సౌందర్య సాధనంగా పనిచేస్తాయి. శరీరానికి అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి.

@ సూర్యరశ్మి వలన కలిగే ఆక్సీకరణ నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి, తద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి.

@ గాడిద పాలతో స్నానం చేయడం వల్ల మెత్తని, మృదువైన చర్మం సొంతం చేసుకోవచ్చు.

@ ప్రస్తుతం ఈ గాడిదల పాలను కాస్మొటిక్ , సోప్స్, ఉత్పత్తులు, ఫేస్ వాష్, షాంపూల తయారీలో వాడుతున్నారు.

ఇక గాడిద పాల నుంచి చీజ్ ను కూడా తయారు చేస్తారు. అయితే ఈ చీజ్ చాలా తక్కువుగా దొరుకుతుంది.కిలో చీజ్ ధర సుమారు రూ.80 వేలు. సెర్బియాకు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు నోవక్ జొకోవిచ్- తన రెస్టారెంట్ల కోసం ఈ చీజ్ ను కొంటారని తెలుస్తోంది.

Also Read :

ఆలివ్ ఆయిల్ ఈ రకమైన చర్మం వారు అసలు వాడవద్దు. వాడితే వచ్చే సైడ్ ఫెక్ట్స్ ఏమిటో తెలుసా..!!

పెట్రోల్ చింత వద్దు.. ఎలక్ట్రిక్ స్కూటర్లు ముద్దు.. ఈ వాహనాలపై హీరో బంపర్ ఆఫర్..