Hero Electric Scooter : పెట్రోల్ చింత వద్దు.. ఎలక్ట్రిక్ స్కూటర్లు ముద్దు.. ఈ వాహనాలపై హీరో బంపర్ ఆఫర్..
ఓ వైపు వాతావరణ కాలుష్యం.. మరోవైపు రోజు రోజుకీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు దీంతో ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పై దృష్టి పెట్టారు. దీంతో హీరో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రారంభించింది...
Hero Electric Scooter : ఓ వైపు వాతావరణ కాలుష్యం.. మరోవైపు రోజు రోజుకీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు దీంతో ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పై దృష్టి పెట్టారు. దీంతో హీరో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రారంభించింది. వినియోగదారులకు లిథియం అయాన్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై 5 సంవత్సరాల వారంటీ ఇస్తోంది. ఈ ఆఫర్ మార్చి 31 వరకూ కంపెనీ ఇస్తుంది. అంతేకాదు కొనుగోలు పై డిస్కౌంట్స్ ను కూడా హమ్ సాఫర్ పేరుతో ఇస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల పై నగదు తగ్గింపు, వారెంట్ అందిస్తుంది.. వివరాల్లోకి వెళ్తే..
స్కూటర్ పై వారంటీ, నగదు తగ్గింపు
హీరో ఎలక్రిక్ ఆప్టిమా ఎలక్ట్రిక్ స్కూటర్వా ఖరీదు చేసే వినియోగదారులకు రూ .4 వేల తగ్గింపు ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్‌తో పాటు కంపెనీ 5 ఏళ్ల వారంటీ కూడా ఇస్తుంది. ఈ ఐదేళ్ల కాలంలో స్కూటర్ కు ఏమైనా రిపేర్లు వచ్చినా సమస్యలు వచ్చినా సరిదిద్దుతుంది. వఇలాంటి వారెంటీతో హీరో ఫ్లాష్ ఎల్ఎక్స్, ఆప్టిమా ఎల్ఎక్స్, నిక్స్ ఎల్ఎక్స్, జియాన్ ఎల్ఎక్స్, నిక్స్ హెచ్ఎక్స్, నిక్స్ హెచ్ఎక్స్ (డబుల్ బ్యాటరీ), నిక్స్ హెచ్ఎక్స్ (ట్రిపుల్ బ్యాటరీ), ఆప్టిమా హెచ్ఎక్స్, ఆప్టిమా హెచ్ఎక్స్ (డబుల్ బ్యాటరీ), ఫోటాన్ హెచ్ఎక్స్, ఫ్లాష్ హెచ్ఎక్స్, నిక్స్ హెచ్ఎక్స్ ప్రో మరియు ఆప్టిమా ఎక్స్ ప్రో వాహనాలున్నాయి.
ఈ ఎలక్ట్రిక్ వాహనం ఖరీదు :
ఈ స్కూటర్లలో 5 ఏళ్ల వారంటీ అన్ని వాహనాలకుంటుంది.. అయితే డిస్కౌంట్ మాత్రం హీరో ఆప్టిమా హెచ్ఎక్స్ వాహనానికి మాత్రమే లభిస్తుంది. ఈ స్కూటర్ పై రూ .4000 డిస్కౌంట్ ను అందిస్తుంది. ఇక ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ .54,990. అయితే ఇదే వాహనాన్ని దేశరాజధాని ఢిల్లీ లో కొనుగోలు చేసే వినియోగాదారులకు ఏళ్ల వారెంటీతో పాటు డిస్కౌంట్ కూడా ఇస్తుంది కంపెనీ.
ఈ స్కూటర్ ను హీరో కంపెనీ ఎలక్ట్రిక్ ఏరోడైనమిక్ డిజైన్‌తో రూపొందించింది. పెద్ద సీటు, టెలిస్కోపిక్ సస్పెన్షన్ కూడా ఉంది. ఇక సియాన్, ఎరుపు, బూడిద రంగుల్లో లభిస్తుంది. ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేయవచ్చు.. ఛార్జింగ్ కు సుమారు 4 గంటల పాటు సమయం పడుతుంది. హీరో యొక్క ఎలక్ట్రిక్ ఆప్టిమా స్కూటర్ 25 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. దీని బరువు 68 కిలోలు మాత్రమే. తక్కువ బరువు కారణంగా, దాని మైలేజ్ కూడా బాగా వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే హీరో ఎలక్ట్రిక్ వాహనం నడపడానికి లైసెన్స్ అవసరం లేదు.. ఇన్ని మంచి క్వాలిటీలు ఉన్న ఈ స్కూటర్ ను కొనుగోలు చేయడానికి ఈ ఆఫర్ మార్చి 31 వరకూ అందిస్తుంది.
Also Read: