Uppena Bollywood Remake: బాలీవుడ్‌కు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’.. హీరో హీరోయిన్లుగా నటించేది ఎవరంటే.!

Uppena Bollywood Remake: ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన మెగా హీరో వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' రికార్డు కలెక్షన్లను కొల్లగొడుతోంది. లవ్ సబ్జెక్టే...

Uppena Bollywood Remake: బాలీవుడ్‌కు వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన'.. హీరో హీరోయిన్లుగా నటించేది ఎవరంటే.!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 23, 2021 | 2:56 PM

Uppena Bollywood Remake: ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ రికార్డు కలెక్షన్లను కొల్లగొడుతోంది. లవ్ సబ్జెక్టే అయినా కూడా.. దర్శకుడు కథాంశాన్ని కొత్తగా తెరకెక్కించడంతో విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో మిగతా ఇండస్ట్రీల చూపు పడింది. రీమేక్ హక్కుల కోసం పోటీపడుతున్నారు.

తమిళంతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘సైరత్’ సినిమాలా కథనంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చూస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే బీ-టౌన్ నిర్మాతలతో చర్చలు జరిగినట్లు సమాచారం.

కాగా, ఈ రీమేక్‌లో బాలీవుడ్ యువ నటుడు ఇషాన్ కట్టర్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించనున్నారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక తమిళంలో విజయ్ సేతుపతి.. దళపతి విజయ్ కొడుకుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?

ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్.. వివరాలివే.!

రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!