కరోనా వైరస్ వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వి’ అత్యవసర వినియోగంపై నేడు చర్చించనున్న నిపుణులు

ఇండియాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతూ దాఖలైన దరఖాస్తుపై సబ్జెక్ట్స్ ఎక్స్ పర్ట్  కమిటీ బుధవారం చర్చించనుంది..

  • Umakanth Rao
  • Publish Date - 11:35 am, Wed, 24 February 21
కరోనా వైరస్ వ్యాక్సిన్ 'స్పుత్నిక్ వి' అత్యవసర వినియోగంపై నేడు చర్చించనున్న నిపుణులు

ఇండియాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతూ దాఖలైన దరఖాస్తుపై సబ్జెక్ట్స్ ఎక్స్ పర్ట్  కమిటీ బుధవారం చర్చించనుంది. ఈ వ్యాక్సిన్ వినియోగం విషయంలో హైదరాబాద్ లోని డా.రెడ్డీస్ లేబొరేటరీ డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా) ని సంప్రదించింది. రివ్యూ ప్రక్రియలో భాగంగా రెండో దశ టెస్టింగ్ సెక్యూరిటీ డేటాను, అలాగే మూడో దశ టెస్టింగ్ డేటాను తాము సమర్పిస్తామని ఈ సంస్థ వెల్లడించింది. ఇండియాలో స్పుత్నిక్ వి టెస్టింగ్, డెలివరీ కోసం, తాము గత ఏడాది సెప్టెంబరులో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని ఈ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఈ టీకామందు మూడో దశను పరీక్షిస్తున్నారు.

అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లను ఇదివరకే అందుబాటులోకి తెచ్చారు. తొలుత జనవరి 16 న దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తరువాత  ఈ నెల 13 నుంచి రెండో డోసు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను ఫ్రంట్ లైన్ వర్కర్లకు, వైద్య సిబ్బందికి ఇస్తున్నారు. ఇప్పటికే 42 శాతానికి పైగా సిబ్బంది ఈ వ్యాక్సిన్లను తీసుకున్నారు. దేశంలో కోవిద్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రష్యా వారి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ని కూడా అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతున్నారు. అటు రష్యా సైతం ఈమేరకు ఇండియాలో ఇందుకు అనుమతించాలని అభ్యర్థించింది.

మరిన్ని చదవండి ఇక్కడ :

ప్రేమించడానికి అమ్మాయి వొద్దు బాబోయ్‌! టిండర్ డేటింగ్ యాప్ వాడటానికి భయపడుతున్న యువకుడు .