పమేలా గోస్వామి డ్రగ్స్ కేసులో బీజేపీ నేత రాకేష్ సింగ్ అరెస్ట్, ఇద్దరు కుమారులను కూడా !
బెంగాల్ లో బీజేపీ యువమోర్చా నేత పమేలా గోస్వామి డ్రగ్స్ కేసులో బీజేపీ నేత రాకేష్ సింగ్ ని, ఆయన ఇద్దరు కొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. బెంగాల్ లోని ఈస్ట్ బుర్ద్వాన్ నుంచి ఢిల్లీకి...
బెంగాల్ లో బీజేపీ యువమోర్చా నేత పమేలా గోస్వామి డ్రగ్స్ కేసులో బీజేపీ నేత రాకేష్ సింగ్ ని, ఆయన ఇద్దరు కొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. బెంగాల్ లోని ఈస్ట్ బుర్ద్వాన్ నుంచి ఢిల్లీకి మంగళవారం రాత్రి వెళ్తుండగా ఆయన ఫోన్ ని ట్రాక్ చేసి కోల్ కతా పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను బుధవారం ఉదయం నగరానికి తీసుకువచ్చి కోర్టులో హాజరు పరచనున్నారు. తనను ఈ కేసులో ఇరికించడానికి పాలక తృణమూల్ కాంగ్రెస్ పన్నిన కుట్ర ఇదని రాకేష్ సింగ్ ఆరోపించారు. అర్ధ రాత్రి నా ఇంటిలో చొరబడి నా పిల్లలను అరెస్టు చేస్తారా అని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. రాకేష్ సింగ్ అరెస్టును రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, ఇతర బీజేపీ నేతలు ఖండించారు. అటు-తాము రాకేష్ ఇంటికి మూడు సార్లు వెళ్లా మని, ఎప్పుడు వెళ్లినా లేడని చెబుతూ వచ్చారని పోలీసులు తెలిపారు. పైగా ఆయన ఇద్దరు కొడుకులు శివమ్ సింగ్, సువం సింగ్ తమను డ్యూటీ చేయనివ్వకుండా అడ్డుకున్నారని, దురుసుగా ప్రవర్తించారని పోలీసులు చెప్పారు.
డ్రగ్స్ కేసులో ఇన్వెస్టిగేషన్ సందర్భంగా రాకేష్ సింగ్ పేరు బయటకురావడంతో ఇండియన్ పీనల్ కోడ్ లోని 160 సెక్షన్ కింద ఆయనకు ఖాకీలు సమన్లు జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ రాకేష్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ ని కలకత్తా హైకోర్టు కొట్టివేసింది. ఢిల్లీలో తనకు అపాయింట్ మెంట్ ఉందని, అందువల్ల తను అందుబాటులో ఉండనని రాకేష్ మొదట తెలిపారు. ఈయనపై రెండు డజన్లకు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి.
కోల్ కతా లో తన పర్సులో 100 గ్రాముల కొకైన్ తీసుకు వెళ్తూ పోలీసులకు పట్టుబడిన పమేలా గోస్వామి.. తనను ఈ కేసులో ఇరికించేందుకు రాకేష్ సింగ్ పన్నిన కుట్ర ఇదని ఆరోపించిన సంగతి విదితమే.
మరిన్ని చదవండి ఇక్కడ :
ప్రేమించడానికి అమ్మాయి వొద్దు బాబోయ్! టిండర్ డేటింగ్ యాప్ వాడటానికి భయపడుతున్న యువకుడు .
కరోనా వైరస్ వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వి’ అత్యవసర వినియోగంపై నేడు చర్చించనున్న నిపుణులు