బెంగాల్ పై బీజేపీ మెయిన్ ఫోకస్, మార్చి 7 న ప్రధాని మోదీ కోల్ కతా సందర్శన, 10 లక్షలమందితో సభ
బెంగాల్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ప్రధానంగా దృష్టి సారించింది. ప్రధాని మోదీ మార్చి 7 న బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
బెంగాల్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ప్రధానంగా దృష్టి సారించింది. ప్రధాని మోదీ మార్చి 7 న బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు 10 లక్షలమందిని సమీకరించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు కోల్ కతాను విజిట్ చేసి.. మోదీ సభకు సమీకరించాల్సిన జనాలు, ఇతర ఏర్పాట్లపై రాష్ట్ర బీజేపీ నేతలతో సమీక్షించనున్నారు. నగరంలో భారీ స్క్రీన్లను, పోస్టర్లను, కటౌట్లనుకూడా ఏర్పాటు చేయనున్నారు. అటు బీజేపీ కార్యకర్తలు గురువారం నుంచి ఇంటింటి ప్రచారానికి శ్రీకారానికి చుట్టనున్నట్టు తెలుస్తోంది. అలాగే వారు 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు లెడ్ బాక్సు తో వెళ్లి ప్రజల ఆలోచనలతో కూడిన తీర్మాన లేఖలను సేకరిస్తారని, దీనివల్ల ప్రజల మూడ్ ఎలా ఉంటుందో తెలుస్తుందని పార్టీ నేతలు తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 1500 కి పైగా ఎన్నికల ర్యాలీలను నిర్వహించాలని కూడా బీజేపీ యోచిస్తోంది. ఈ సభల్లో మోదీతో బాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు కూడా పాల్గొంటారని ఓ సీనియర్ నేత వెల్లడించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రోజూ అయిదారు ర్యాలీలు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. రానున్న ఏప్రిల్-మే నెలల్లో ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉన్నాయి. ఇప్పటికే బెంగాల్ లో 5 పరివర్తన యాత్రలను బీజేపీ నిర్వహించింది.
మరిన్ని చదవండి ఇక్కడ :
ప్రేమించడానికి అమ్మాయి వొద్దు బాబోయ్! టిండర్ డేటింగ్ యాప్ వాడటానికి భయపడుతున్న యువకుడు .
జార్ఖండ్‌లో వెలుగుచూసిన దారుణం.. ఐదేళ్ల చిన్నారితో సహా ఐదుగురిని నరికి చంపిన దుండగులు..!