జార్ఖండ్‌లో వెలుగుచూసిన దారుణం.. ఐదేళ్ల చిన్నారితో సహా ఐదుగురిని నరికి చంపిన దుండగులు..!

జార్ఖండ్‌ రాష్ట్రంలోదారుణం జరిగింది. ఓ చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అత్యంత కిరాతకంగా హత్యచేశారు.

జార్ఖండ్‌లో వెలుగుచూసిన దారుణం.. ఐదేళ్ల చిన్నారితో సహా ఐదుగురిని నరికి చంపిన దుండగులు..!
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 24, 2021 | 12:40 PM

family brutally killed : జార్ఖండ్‌ రాష్ట్రంలోదారుణం జరిగింది. ఓ చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అత్యంత కిరాతకంగా హత్యచేశారు. గుమ్లా జిల్లాలోని కామ్‌దరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. తండ్రి, తల్లి, కుమారుడు, కోడలు, ఓ చిన్నారిని పదునైన ఆయుధంతో పొడిచి హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. మంగళవారం రాత్రి ఈ ఘోరం వెలుగుచూసింది. స్థానికులు బుధవారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పహర్తోలి గ్రామానికి చెందిన నికుదీన్ తోప్నో (60) కుటుంబం నివాసముంటోంది. బుధవారం ఉదయం నికుదీన్ కుటుంబసభ్యుులు ఎవరు బయటకు రాకపోవడంతో.. ఇరుగుపొరుగు వారు వారి ఇంట్లోకి వెళ్లారు. దీంతో ఐదుగురు కుటుంబసభ్యులు రక్తపుమడుగులో విగతజీవులై పడి ఉన్నారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటా హుటీన అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతులు నికుదీన్ తోప్నో (60), భార్య జోస్పినా (55), వారి కుమారుడు విన్సెంట్ (35), కోడలు సైల్వంతీ (30), వీరి ఐదేళ్ల కుమారుడు అశ్విన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ హత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. వీరంతా ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, కుటుంబం వివాదాలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, గత కొంతకాలంగా నికుదీన్ కుటుంబం ఆర్ధికంగా పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు స్థానికులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితులు కోసం గాలిస్తున్నారు. డాగ్ స్వ్యాడ్‌ను రంగంలోకి దింపి, ఘటనా స్థలిలో ఆధారాలను సేకరిస్తున్నారు. ఇంటిలో మృతదేహాలు ఒక్కో చోట పడి ఉండటంతో హత్యగానే భావిస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని పోస్ట్‌మార్టం కోసం తరలించినట్టు తెలిపారు. వీరి శరీరాలపై ఉన్న గాయాలను బట్టి గొడ్డలితో దాడిచేసిన చంపిపట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.

Read Also…  అసోంలో తీవ్రవాదానికి స్వస్తి పలికిన 1,039 మంది మిలిటెంట్లు.. సీఎం సోనోవాల్ సమక్షంలో లొంగుబాటు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!