Encounter: అనంతనాగ్‌లో నలుగురు ఉగ్రవాదుల హతం.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
Jammu Kashmir Police: జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో..
Jammu Kashmir Police: జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీగుఫ్వారాలోని షల్గుల్ అటవీ ప్రాంతంలోఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఉదయం ఎదురుకాల్పులు జరిగాయని పోలీసులు వెల్లడించారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని.. ఇప్పటివరకు ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల గురించి సమాచారం అందడంతో స్థానిక పోలీసులు, ఆర్మీ బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో బలగాలు సైతం కాల్పులు జరుపడంతో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అనంతనాగ్ ప్రాంతంలో ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు. కాగా.. గత వారం ఈ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Also Read: