మాకు కట్నం వద్దు, మీ కూతుర్ని ఇవ్వండి చాలు, రాజస్తాన్ లో 11 లక్షల సొమ్మును తిరిగి ఇచ్ఛేసిన రిటైర్డ్ ప్రిన్సిపాల్

వరకట్నం కోసం కక్కుర్తి పడే వ్యక్తులకు ఓ రిటైర్డ్ ప్రిన్సిపల్ మంచి గుణపాఠమే నేర్పాడు. కట్నం కోసం బలవంతంగా తమ కాబోయే కోడళ్ల కుటుంబాల నుంచి భారీ ఎత్తున సొమ్ములు గుంజే వారికీ కనువిప్పు కలిగించాడు.

  • Umakanth Rao
  • Publish Date - 1:40 pm, Wed, 24 February 21
మాకు కట్నం వద్దు, మీ కూతుర్ని ఇవ్వండి చాలు, రాజస్తాన్ లో 11 లక్షల సొమ్మును తిరిగి ఇచ్ఛేసిన రిటైర్డ్ ప్రిన్సిపాల్

వరకట్నం కోసం కక్కుర్తి పడే వ్యక్తులకు ఓ రిటైర్డ్ ప్రిన్సిపల్ మంచి గుణపాఠమే నేర్పాడు. కట్నం కోసం బలవంతంగా తమ కాబోయే కోడళ్ల కుటుంబాల నుంచి భారీ ఎత్తున సొమ్ములు గుంజే వారికీ కనువిప్పు కలిగించాడు. రాజస్తాన్ లో నివసించే మాజీ ప్రిన్సిపల్ గురించే తెలుసుకుంటే.. తమకు వరకట్నం వద్దని, కేవలం మీ కూతురిని ఇస్తే చాలునని, తమ కూతురిలా చూసుకుంటామంటూ తన కాబోయే వియ్యంకుడు ఇచ్చిన 11 లక్షలను తిరిగి ఆయనకే ఇచ్చేశాడు. ఈ రాష్ట్రంలోని టోంక్ జిల్లా బుందీ గ్రామంలో జరిగిందీ విచిత్ర సంఘటన. బ్రిజ్ మోహన్ మీనా అనే ఈయన.. తన కుమారుడి నిశ్చితార్ధం సందర్భంగా తన కాబోయే వియ్యంకుడు ఓ ప్లేటులో 11 లక్షల 101 రూపాయల  నోట్ల కట్టలను పెట్టి ఇవ్వగా..తీసుకున్నట్టే తీసుకున్నాడు. వెంటనే అందులో నుంచి 101 రూపాయలను మాత్రం తీసుకుని మిగతా కట్టలు(11 లక్షలు) వద్దని ఆయనకు తిరిగి ఇచ్చేశాడు. మాకు మీ కూతురు చాలు అన్నాడు. దీంతో వెంటనే అక్కడ కలకలం రేగింది. కానీ బ్రిజ్ మోహన్ అందరికీ నచ్ఛజెబుతూ.. వారిని శాంతపరిచాడు. అంతా ఆశ్చర్యపోతూనే ఆయనను ప్రశంసించారు. అటు వియ్యంకుడితో బాటు  బ్రిజ్ మోహన్ కు కాబోయే కోడలు ఆర్తీ మీనా కూడా ఆయన విశాల హృదయానికి పొంగిపోయింది. సైన్స్, బీ ఈడీ చదువుకున్న ఈమె… ఆయన కుమారుడు రామ్ ధన్ ని పెళ్లాడబోతోంది.

ఈ జిల్లాలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొటిసారి. సమాజంలో ఇలాంటి గొప్ప వ్యక్తులు కూడా ఉంటారా అని ప్రతివారూ ముక్కున వేలేసుకున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ :

Success Story of Jatin Ahuja : తండ్రి దగ్గర రూ.70 వేలు అప్పు తీసుకుని… నేడు 300 కోట్లకు అధిపతి అయ్యాడు..

రాజన్నకు వెన్నుదన్నుగా ఉన్న నేత రాజకీయాలు వదిలేశారు.. పార్టీయే సర్వం అనుకున్నవారే సైలెంట్ అయ్యారు.. రఘువీరా అజ్ఞాతవాసం అసలు కథ..!