AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసోంలో తీవ్రవాదానికి స్వస్తి పలికిన 1,039 మంది మిలిటెంట్లు.. సీఎం సోనోవాల్ సమక్షంలో లొంగుబాటు

ఉద్యమ బాట పట్టినవారు జనజీవన స్రవంతిలో కలిశారు. అసోంలో తీవ్రవాదానికి స్వస్తి పలికిన 1039 మంది మిలిటెంట్లు అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ సమక్షంగా లొంగిపోయారు.

అసోంలో తీవ్రవాదానికి స్వస్తి పలికిన 1,039 మంది మిలిటెంట్లు.. సీఎం సోనోవాల్ సమక్షంలో లొంగుబాటు
Balaraju Goud
|

Updated on: Feb 24, 2021 | 12:09 PM

Share

Militants Surrender in Assam : ఇంతకాలం సమాజానికి దూరం ఉంటూ ఉద్యమ బాట పట్టినవారు జనజీవన స్రవంతిలో కలిశారు. అసోంలో తీవ్రవాదానికి స్వస్తి పలికిన 1039 మంది మిలిటెంట్లు అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ సమక్షంగా లొంగిపోయారు. అసోంలో ఐదు తీవ్రవాద సంస్థలకు చెందిన 1,039 మంది మిలిటెంట్లు తుపాకులను అప్పగించి ప్రజా జీవితంలోకి వచ్చి సామాన్యులుగా మారిపోయారు.

పీపుల్స్ డెమోక్రటిక్ కౌన్సిల్ ఆఫ్ కర్బీ లాంగ్రీ, కర్బీ లాంగ్రీ ఎన్సీ హిల్స్ లిబరేషన్ ఫ్రంట్, కర్బీ పీపుల్స్ లిబరేషన్ టైగర్, కూకి లిబరేషన్ ఫ్రంట్, యునైటెడ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సంస్థలకు చెందిన 1,039 మంది లొంగిపోయారని అసోం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. బోరోలాండ్ లోని నిషేధిత నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ కమాండర్ సాంగ్ బిజిత్ లొంగిపోయిన వారిలో ఉన్నారు. బోడోలాండ్ జిల్లాలో బిజిత్ మైనారిటీలపై పలు దాడులకు పాల్పడ్డారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు లొంగిపోయిన తీవ్రవాదులకు అసోం సీఎం సోనోవాల్ స్వాగతం పలికారు. అసోంను తీవ్రవాదం నుంచి విముక్తి చేస్తామని సీఎం సోనోవాల్ ప్రకటించారు. బుల్లెట్‌తో కాకుండా బ్యాలెట్‌తో ప్రజాస్వామ్య స్థాపన సాధ్యమని సీఎం సోనోవాల్ తెలిపారు.

ఇదీ చదవండిః కరోనా వైరస్ వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వి’ అత్యవసర వినియోగంపై నేడు చర్చించనున్న నిపుణులు

షుగ‌ర్ ఉన్న‌వారు సపోటా తింటే ఏమౌతుందో తెలుసా? డాక్టర్స్‌ చెప్పేది
షుగ‌ర్ ఉన్న‌వారు సపోటా తింటే ఏమౌతుందో తెలుసా? డాక్టర్స్‌ చెప్పేది
అరటి పండు Vs జామ పండు: ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
అరటి పండు Vs జామ పండు: ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
ఇన్నాళ్లు తమ పొట్ట నింపిన తాటి చెట్టు పైనుంచే.. అనంత లోకాలకు
ఇన్నాళ్లు తమ పొట్ట నింపిన తాటి చెట్టు పైనుంచే.. అనంత లోకాలకు
తొలి మ్యాచ్‌కు ముందే దిమ్మతిరిగే షాక్.. ఆడకుండానే పాక్ ఔట్..?
తొలి మ్యాచ్‌కు ముందే దిమ్మతిరిగే షాక్.. ఆడకుండానే పాక్ ఔట్..?
జియో హాట్ స్టార్‌ను వదలని ప్రభాస్ ఫ్యాన్స్..!
జియో హాట్ స్టార్‌ను వదలని ప్రభాస్ ఫ్యాన్స్..!
ఫోన్‌లో స్టోరేజ్‌ ఫుల్‌ అయిందా? ఇలా చేయండి 2TB ఫ్రీ
ఫోన్‌లో స్టోరేజ్‌ ఫుల్‌ అయిందా? ఇలా చేయండి 2TB ఫ్రీ
శని, శుక్ర సంయోగం.. వీరికి అలర్ట్.. మొండితనం విడిచి పెట్టాల్సిందే
శని, శుక్ర సంయోగం.. వీరికి అలర్ట్.. మొండితనం విడిచి పెట్టాల్సిందే
భారత్ - అమెరికా చారిత్రాత్మక ఒప్పందం.. మన రైతులకు, వ్యాపారులకు..
భారత్ - అమెరికా చారిత్రాత్మక ఒప్పందం.. మన రైతులకు, వ్యాపారులకు..
టీ20 ప్రపంచ కప్ ప్రారంభోత్సవ వేడుకలో తళుక్కున మెరవనున్న తారలు..
టీ20 ప్రపంచ కప్ ప్రారంభోత్సవ వేడుకలో తళుక్కున మెరవనున్న తారలు..
EPF వర్సెస్‌ VPF.. రెండింటికీ తేడా ఏంటి?
EPF వర్సెస్‌ VPF.. రెండింటికీ తేడా ఏంటి?