మల్యాల రోడ్డు ప్రమాదం.. మాయమైన బంగారాన్ని 24గంటల్లోనే స్వాధీనం చేసుకున్న పోలీసులు
Police found missing 2.3 kgs gold: పెద్దపల్లి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యాపారులు మరణించగా.. మరో ఇద్దరు..
Police found missing 2.3 kgs gold: పెద్దపల్లి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యాపారులు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాద సమయంలో 2 కిలోల 300 గ్రాముల బంగారం మాయమైనట్లు పోలీసులకు భాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మాయమైన బంగారాన్ని 24గంటల్లోనే స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నరసారావుపేటకు చెందిన బంగారం వ్యాపారులు ప్రయాణిస్తున్న కారు పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్యాల ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కొత్త శ్రీనివాస్, కొత్త రాంబాబు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో 108 వాహనంలో వీరిని గోదావరిఖనికి తరలించారు.
ప్రమాదం జరిగిన సమయంలో బాధితుల వెంట రూ.కోటిపైచిలుకు విలువగల బంగారం ఉంది. ఈ క్రమంలో 108 సిబ్బంది కొంత బంగారాన్ని గుర్తించి రామగుండం ఎస్సైకు అప్పగించారు. దీంతో బాధితుల వద్ద 3 కిలోల 300 గ్రాముల బంగారం లభించినట్లు పోలీసులు ప్రకటించారు. వ్యాపారుల వద్ద ఉన్న మరో 2 కిలోల 300 గ్రాముల బంగారం మాయమైనట్లు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు 24 గంటల్లో కేసును ఛేదించారు. నిందితుల నుంచి 2 కిలోల 300 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరికొంతసేపట్లో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు.
Also Read: