AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలిఫోర్నియాలోని బ్లాక్ హార్స్ లోయలోపడిన కారు.. తీవ్రంగా గాయపడ్డ గోల్ఫ్‌ క్రీడాకారుడు టైగర్‌ వుడ్స్‌

లాస్‌ ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ గోల్ఫ్‌ క్రీడాకారుడు టైగర్‌ వుడ్స్‌ తీవ్రంగా గాయపడ్డారు.

కాలిఫోర్నియాలోని బ్లాక్ హార్స్ లోయలోపడిన కారు.. తీవ్రంగా గాయపడ్డ గోల్ఫ్‌ క్రీడాకారుడు టైగర్‌ వుడ్స్‌
Balaraju Goud
|

Updated on: Feb 24, 2021 | 8:24 AM

Share

Tiger Woods Accident : లాస్‌ ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ గోల్ఫ్‌ క్రీడాకారుడు టైగర్‌ వుడ్స్‌ తీవ్రంగా గాయపడ్డారు. కాలిఫోర్నియాలో కారు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు ఒక పక్క భాగం నుజ్జునుజ్జయింది. దీంతో టైగర్ వుడ్స్ కారులోనే ఇరుక్కుపోయాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న లాస్‌ఏంజిల్స్‌ అగ్నిమాపక, పారామెడికల్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆయనను కారు నుంచి వెలుపలికి తీసి స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అతని కాలికి తీవ్ర గాయాలవగా.. శస్త్ర చికిత్స చేశారు. అయితే, ప్రాణాపాయం ఏమిలేదని, ఆయన కొద్దిరోజుల్లోనే కోలుకుంటారని వైద్యులు తెలిపారు. కాలిఫోర్నియాలోని బ్లాక్ హార్స్ రోడ్డు మార్గంలో జరిగిన ఈ ఘటన సమయంలో కారులో టైగర్ వుడ్స్ ఒక్కరే అన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలావుంటే.. గోల్ఫ్‌ ప్రపంచ చాంపియన్‌ రోడ్డు ప్రమాదానికి గురవడం ఇదే తొలిసారి కాదు. గతంలో రెండుసార్లు 2009, 2017లోనూ ఆయన కారు ప్రమాదానికి గురైంది. మొదటి రోడ్డు ప్రమాదం తర్వాత దాదాపు ఐదు నెలలు మిస్సిసీపి రిహాబిలిటేషన్ సెంటర్‌లో గడిపాడు. రెండో ప్రమాదంలోనూ కొద్ది నెలలకు కోలుకుని గోల్ఫ్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. మరోసారి ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. టైగర్‌ వుడ్స్‌ ఇప్పటి వరకు 15 ప్రధాన గోల్ఫ్‌ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు. చివరిసారిగా 2019లో టైటిల్‌ను గెలిచాడు. త్వరలోనే జరుగబోయే మాస్టర్స్‌ టోర్నీలో పాల్గొనాల్సి ఉంది..

Read Also..Gujarat Civic Polls Results: కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. మళ్లీ ఆరుకు ఆరు కైవసం..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..