AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో టీమిండియా రథసారధి.. మొటెరా టెస్ట్‌లో ఇది సాకారం కానుందా.?

Virat Kohli One Step Away From World Record: తన అద్భుత ఆట తీరుతో దేశాలతో సంబంధం లేకుండా క్రికెట్‌ అభిమానులతో పాటు విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటున్నాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. ఇదిలా ఉంటే తాజాగా విరాట్‌ను మరో ప్రపంచ రికార్డు ఊరిస్తోంది...

Virat Kohli: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో టీమిండియా రథసారధి.. మొటెరా టెస్ట్‌లో ఇది సాకారం కానుందా.?
Narender Vaitla
|

Updated on: Feb 24, 2021 | 10:09 AM

Share

Virat Kohli One Step Away From World Record: తన అద్భుత ఆట తీరుతో దేశాలతో సంబంధం లేకుండా క్రికెట్‌ అభిమానులతో పాటు విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటున్నాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. ఒక్కో రికార్డును బ్రేక్‌ చేసుకుంటూ ప్రపంచ క్రికెట్‌లో దూసుకుకెళుతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా విరాట్‌ను మరో ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. అరుదైన రికార్డును సొంతం చేసుకునే క్రమంలో విరాట్‌ కోహ్లి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన కెప్టెన్ల జాబితాలో మొదటి స్థానంలోకి వెళ్లడానికి కోహ్లి.. కేవలం ఒక్క సెంచరీ దూరంలో ఉన్నాడు. దీంతో ఇండియా- ఇంగ్లాండ్‌ల మధ్య అహ్మదాబాద్‌లోని మోటెరా స్టేడియం వేదికగా జరిగే మూడో టెస్టుపై అందరి దృష్టి పడింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి ఈ ప్రపంచ రికార్డును బ్రేక్‌ చేస్తాడని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ చేస్తే.. ఇప్పటి వరకు అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ (41) పేరుతో ఉన్న రికార్డును బద్దలు కొట్టనున్నాడు. ప్రస్తుతం కోహ్లి 41 సెంచరీలతో కొనసాగుతున్నాడు. మూడో టెస్ట్‌లో కోహ్లి సెంచరీ చేస్తే.. 42 సెంచరీలతో పాంటింగ్‌ను వెనక్కి నెట్టి కోహ్లి తొలి స్థానంలో నలిలవనున్నాడన్న మాట. మరి టీమిండియా రథ సారధి ఈ ఘనతను సాధిస్తాడో లేదో చూడాలి. ఇదిలా ఉంటే 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేసిన కోహ్లీ.. అప్పటి నుంచి 10 మ్యాచ్‌లు ఆడినా ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం గమనార్హం.

Also Read: కాలిఫోర్నియాలోని బ్లాక్ హార్స్ లోయలోపడిన కారు.. తీవ్రంగా గాయపడ్డ గోల్ఫ్‌ క్రీడాకారుడు టైగర్‌ వుడ్స్‌

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..