Ramnath Kovind: ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంను ప్రారంభించనున్న రాష్ట్రపతి.. పాల్గొననున్న అమిత్‌షా..
Ramnath Kovind Inaugurate Motera Stadium: అహ్మదబాద్ వేదికగా బుధవారం అద్భుతం ఆవిష్కృతం కానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం మొటెరా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది...
Ramnath Kovind Inaugurate Motera Stadium: అహ్మదబాద్ వేదికగా బుధవారం అద్భుతం ఆవిష్కృతం కానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం మొటెరా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ స్టేడియం ప్రారంభం కానుంది. రాష్ట్రపతి స్టేడియాన్ని ప్రారంభించిన తర్వాత ఈ స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్‌ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా కూడా హాజరుకానున్నారు. ఇక రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్‌లో పర్యటిస్తున్న రాష్ట్రపతి మొటెరా స్టేడియం ఓపెనింగ్ కార్యక్రమంతో పాటు.. గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ మూడో స్నాతకోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇక మొటెరా స్టేడియం విశేషాల గురించి చెప్పాలంటే.. ఈ స్టేడియాన్ని 63 ఎకరాల్లో సుమారు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇందులో ఒకేసారి ఏకంగా లక్ష పదివేల మంది మ్యాచ్‌ను వీక్షించవచ్చు. ఇక దేశంలో ఫ్లడ్ లైట్టకు బదులు ఎల్‌ఈడీ లైట్లను వినియోగించిన ఏకైక స్టేడియం ఇదే కావడం విశేషం. మరి పింక్ బాల్‌తో జరుగుతోన్న ఈ డే నైట్ టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా ఏ స్థాయిలో రాణిస్తుందో చూడాలి. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లలో భారత్, ఇంగ్లాండ్ చెరో మ్యాచ్ గెలడంతో మూడో టెస్ట్‌పై అందరిలోనూ ఆసక్తినెలకొంది.
Also Read: India vs England: పింక్ బాల్ మ్యాచ్‌పై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు..