India vs England: పింక్ బాల్ మ్యాచ్‌పై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు..

Ind vs Eng: పింక్ టెస్టుకు వేదికైన మొతేరా పిచ్​ స్పిన్​కు సహకరిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ మాత్రం పేసర్లకూ అవకాశాలు కొట్టి పారేయలేమని..

India vs England: పింక్ బాల్ మ్యాచ్‌పై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు..
Indian captain Virat Kohli
Follow us

|

Updated on: Feb 23, 2021 | 6:56 PM

Pink Ball: పింక్ టెస్టుకు వేదికైన మొతేరా పిచ్​ స్పిన్​కు సహకరిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ మాత్రం పేసర్లకూ అవకాశాలు కొట్టి పారేయలేమని అభిప్రాయపడ్డాడు. నాలుగు టెస్టుల సిరీస్​లో ఇరు జట్లు 1-1 ఆధిక్యంతో ఉన్నాయి.

మొతేరా స్టేడియంలో ఫిబ్రవరి 24న జరుగనున్న మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. మొతేరా స్టేడియం పిచ్ స్పిన్​కు సహకరిస్తుందా? లేదా అన్నదే ఇప్పడు అందరి ప్రశ్న. బంతి పాతబడేంత వరకు స్వింగ్​కు సహకరిస్తుందనేది కోహ్లీ అంచనా వేస్తున్నాడు.

“బంతి కచ్చితంగా స్వింగ్ అవుతుందా అనేది చెప్పలేము. కానీ, పేసర్లు కూడా కీలక పాత్ర పోషిస్తారు. ఎరుపు బంతితో పోలిస్తే గులాబీ బంతి ఎక్కువగా స్వింగ్​ అవుతుంది. 2019లో బంగ్లాదేశ్​తో ఆడిన పింక్​ టెస్టు ద్వారా మాకు ఈ విషయం అర్థమైంది” అని టీమిండియా కెప్టెన్​ వెల్లడించాడు.

బంతి ఒకవేళ సీమ్​కు అనుకూలిస్తే.. అది తమకు కలిసొస్తుందన్న ఇంగ్లాండ్ జట్టు అంచనాపై కోహ్లీ ఇలా కామెంట్ చేశాడు. ఇంగ్లాండ్ జట్టులోనూ చాలా మైనస్ పాయింట్లు ఉన్నాయన్నాడు. ఇంగ్లాండ్ జట్టు బలాబలాలపై విశ్లేష చేశాడు. గతంలో వాది దేశంలో వారిని ఓడించామన్నాడు. అయితే కొత్తగా నిర్మించిన స్టేడియంలో పిచ్​ పేసర్లకు సహకరిస్తే అది వారికి మాత్రమే కాదు మాక్కూడా సహయోగపడుతుందని అన్నాడు.

“పర్యటక జట్టులోనూ చాలా బలహీనతలు ఉన్నాయి. ఇంగ్లాండ్ టీమ్​ బలాలు, బలహీనతల గురించి మాకు అవసరం లేదు. గతంలో వారి దేశంలోనే వారిని ఓడించాము. ఒకవేళ పిచ్​ పేసర్లకు సహకరిస్తే అది వారికి మాత్రమే కాదు.. మాక్కూడా ఉపయోగమే. కొత్తగా నిర్మించిన స్టేడియంలో ఇరు జట్లకు చాలా విషయాలపై అవగాహన లేదు. పేసర్లకు, స్పిన్నర్లకు పింక్​ బాల్​ ఎలా సహకరిస్తుందనే దానిపైనే ఇండియా బలం ఆధారపడి ఉంది. మా జట్టులోనూ అత్యుత్తమ బౌలర్లు ఉన్నారు. ఏది ఎలా ఉన్నా మేము ఆడటానికి సిద్ధమే”-విరాట్​ కోహ్లీ, భారత కెప్టెన్.

మొతేరా పిచ్​ స్పిన్​కు సహకరిస్తుందని భారత సీనియర్​ బ్యాట్స్​మెన్​ రోహిత్​ శర్మ ఇదివరకే తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఇది కూడా చదవండి

Uttarakhand Flash Floods: ఇక ఇందులో ఎవరూ బతికిలేరట..! ధౌలిగంగా ప్రళయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

India vs England: ఓ అద్భుతం.. ఓ వీక్షణం.. మొతెరా స్టేడియంలో ఎన్నో ప్రత్యేకతలు.. ఓ సారి చూద్దాం..

పెట్రోల్‌ రేట్లు త్వరలో తగ్గుతాయ్..ఇలా చేస్తే..! కీలక సూచనలు చేసిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..