Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand Flash Floods: ఇక ఇందులో ఎవరూ బతికిలేరట..! ధౌలిగంగా ప్రళయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Flash Floods: ఉత్తరాఖండ్‌ జలప్రళయంలో ఇంకా ఎవరు సజీవంగా బయటపడే అవకాశాలు లేవని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. దీంతో అందరూ చనపోయినట్టు ప్రకటించబోతున్నారు.

Uttarakhand Flash Floods: ఇక ఇందులో ఎవరూ బతికిలేరట..! ధౌలిగంగా ప్రళయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
uttarakhand flash floods
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 23, 2021 | 3:37 PM

Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌ జలప్రళయంలో ఇంకా ఎవరు సజీవంగా బయటపడే అవకాశాలు లేవని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. దీంతో అందరూ చనపోయినట్టు ప్రకటించబోతున్నారు. ప్రమాదం జరిగి 5 రోజులు గడిచిపోవడంతో ఆశలు వదులుకుంటున్నారు కార్మికుల కుటుంబసభ్యులు. గల్లంతైన వారిని ‘‘చనిపోయినట్లుగా భావిస్తున్నాం’’ అని ప్రకటించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు తాజాగా ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఫిబ్రవరి 7న ధౌలిగంగాలో మంచుచరియలు విరిగిపడటంతో నది ఉప్పొంగి ఆకస్మిక వరదలు వచ్చాయి. ఈ జల విలయానికి ఓ విద్యుత్‌ కేంద్రంతో పాటు ఐదు వంతెనలు కొట్టుకుపోగా.. మరో విద్యుత్‌కేంద్రం తీవ్రంగా ధ్వంసమైంది. ఈ వరదల్లో 204 మంది గల్లంతయ్యారు. వీరిలో ఇప్పటివరకు 68 మృతదేహాలను గుర్తించారు. 22 శరీరభాగాలు కూడా లభించాయి.

ఒక్క తపోవన్‌ సొరంగంలోనే 14 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 136 మంది ఆచూకీ తెలియరాలేదు. ప్రమాదం జరిగి రెండు వారాలు దాటినా వీరి ఆచూకీ తెలియకపోవడంతో వారంతా మరణించి ఉంటారని అధికారులు చెబుతున్నారు. కాగా.. ప్రమాదం సమయంలో తపోవన్‌ విద్యుత్‌ కేంద్రం సొరంగంలో చిక్కుకున్న కొంతమందిని సహాయకసిబ్బంది రక్షించారు.

ఇది కూడా చదవండి :

India vs England: మొతేరా స్టేడియంలో మోత మోగించే దమ్మున్న ఆటగాళ్లు ఎవరున్నారు…!