- Telugu News Photo Gallery Sports photos India vs england the worlds largest cricket stadium motera stadium capacity and facts
India vs England: ఓ అద్భుతం.. ఓ వీక్షణం.. మొతెరా స్టేడియంలో ఎన్నో ప్రత్యేకతలు.. ఓ సారి చూద్దాం..
Ind vs Eng: అహ్మదాబాద్ మొతేరా వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు బుధవారం జరుగనుంది. అయితే, మ్యాచ్ కన్నా.. ప్రత్యేక ఆకర్షణగా ఈ స్టేడియం నిలుస్తోంది.
Updated on: Feb 23, 2021 | 5:25 PM

గుజరాత్‌లోని సబర్మతి నది ఒడ్డున 1982లో దీనిని నిర్మించారు. అక్టోబరు 2015లో దీనిని పునరుద్ధరించాలని, సామర్థ్యం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా తీర్చిదిద్దాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

63 ఎకరాలలో విస్తరించి ఉన్న 700 కోట్ల వ్యయంతో మొతేరా స్టేడియం నిర్మించారు. స్టేడియంలో ఒలింపిక్ పోటీలకు ఉపయోగించే అంతటి పెద్ద సైజు స్విమ్మింగ్ పూల్ సహా అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. స్టేడియంలో 4 డ్రెస్సింగ్ రూములు ఉన్నాయి.

ప్రేక్షకుల సామర్థ్యం ప్రకారం మొతేరా స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానం. ఈ స్టేడియంలో లక్ష 10 వేల మంది ప్రేక్షకులు ఒకేసారి మ్యాచ్‌ను ఆస్వాదించవచ్చు. అంతకుముందు.. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం 90 వేల ప్రేక్షకుల సామర్థ్యాన్ని కలిగివుంది. అయితే మొతేరా స్టేడియం మెల్బోర్న్ స్డేడియం కంటే పెద్దది.

భారతదేశంలోని ఏ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల అవసరం లేదు..మొతేరా స్టేడియంలో ఫ్లడ్ లైట్లకు బదులుగా LED లైట్లను ఉపయోగించారు. దేశంలో ఎల్‌ఈడీ కాంతులు వెదజల్లనున్న మొట్టమొదటి స్టేడియం కూడా ఇదే కావడం విశేషం.

ఫ్లడ్‌లైట్లకు బదులు స్టేడియం పైకప్పునకే ఎల్‌ఈడీ లైట్లను అమర్చారు. బౌండరీ ఎల్‌ఈడీ లైట్ల కారణంగా, రాత్రి మ్యాచ్‌లలో బంతిని బాగా చూడటంలో ఆటగాళ్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్టేడియంలో ఆటగాళ్ల నీడ కూడా పడే అవకాశం లేదు. LED లైట్ల వాడకం నీడలను ప్రతిబింబించదు.




