Ravi Kiran |
Updated on: Feb 23, 2021 | 5:05 PM
1. ఆరోన్ ఫించ్: ఈ సీజన్‌లో పెద్దగా ఓపెనర్లను ఎంపిక చేయలేదు. కాబట్టి త్వరలో ఓపెనర్ కావాలనుకున్న ఏ జట్టైనా ఇతడిని తీసుకోవచ్చు.
2. జాసన్ రాయ్: ఈ ఆటగాడికి ఐపీఎల్‌లో అమోఘమైన రికార్డు ఉంది. అలాగే హార్డ్ హిట్టర్ కావడంతో త్వరలోనే టీమ్స్ ఇతడిని తీసుకునే అవకాశం ఉంది.
3. అలెక్స్ హేల్స్: ఇంగ్లాండ్ కీ-ప్లేయర్ అయిన ఇతడు బిగ్ బాష్ లీగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఓపెనర్ గానే కాకుండా మిడిల్ ఆర్డర్‌లో ఆడగలడు కాబట్టి.. ఏ విదేశీ ప్లేయర్‌కు గాయం అయినా.. ఇతడిని తీసుకునే అవకాశం ఉంది.
4. మార్నస్ లబూషేన్: వన్డేలు, టెస్టులు మాత్రమే కాదు.. బిగ్ బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ తరపున అద్భుత ప్రదర్శనలు ఇచ్చాడు లబూషేన్. అటు బ్యాట్, ఇటు బాల్‌తోనూ తన ప్రతిభ చూపించగలడు. స్పిన్నింగ్ ఆల్‌రౌండర్ కావాలంటే కరెక్ట్ పర్సన్ ఇతడే.
5. బెహ్రెన్‌డ్రూఫ్: రెండు సీజన్ల ముందు ముంబై తరపున ఆడిన ఇతడు ఈ ఏడాది బీబీఎల్‌లో 16 వికెట్లు తీశాడు. ఇతడిని ఇప్పుడు వేలంలో ఎంచుకోకపోయినా.. త్వరలోనే తీసుకోవచ్చు.