1/6

గత కొన్ని సీజన్ల నుంచి ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున కంసిస్టెంట్గా రాణిస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఐపీఎల్ 2020లో 480 పరుగులు చేశాడు. దీనితో అతడిని టీమిండియా జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సరైన అవకాశం రావడంతో అందరి చూపు అతడిపైనే ఉన్నాయి.
2/6

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున రాహుల్ తేవాటియా అద్భుతంగా రాణిస్తున్నాడు. గత సీజన్‌లో జట్టు పలు మ్యాచ్‌లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
3/6

ఇషాన్ కిషన్ అటు రంజీ, ఇటు విజయ్ హజారే ట్రోఫీ, ఐపీఎల్‌లలో అద్భుత ప్రదర్శనలు కనబరుస్తున్నాడు.
4/6

సంజూ శాంసన్ తనకి వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లలో పూర్తిగా విఫలమయ్యాడు. నిలకడలేమి అతడ్ని జట్టుకు దూరం చేస్తోందని చెప్పాలి.
5/6

గత రెండేళ్ల వరకు కుల్దీప్ టీమిండియా వన్డే జట్టులో కీలక ఆటగాడు. అయితే ఇప్పుడు చోటు దొరుకుతుందో.? లేదో.? అనేది డౌట్.. టెస్టుల్లో అవకాశం లభించినా దాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు తేవాటియా రాణిస్తే.. కుల్దీప్ కెరీర్ ప్రశ్నార్ధకమే.
6/6

మనీష్ పాండేను గాయం కారణంగా సెలెక్టర్లు ఎంపిక చేయకపోగా.. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ రాకతో అవకాశాలు వస్తాయా.? లేదా.? అనేది చూడాలి.