అసోంలో తీవ్రవాదానికి స్వస్తి పలికిన 1,039 మంది మిలిటెంట్లు.. సీఎం సోనోవాల్ సమక్షంలో లొంగుబాటు

ఉద్యమ బాట పట్టినవారు జనజీవన స్రవంతిలో కలిశారు. అసోంలో తీవ్రవాదానికి స్వస్తి పలికిన 1039 మంది మిలిటెంట్లు అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ సమక్షంగా లొంగిపోయారు.

  • Balaraju Goud
  • Publish Date - 12:09 pm, Wed, 24 February 21
అసోంలో తీవ్రవాదానికి స్వస్తి పలికిన 1,039 మంది మిలిటెంట్లు.. సీఎం సోనోవాల్ సమక్షంలో లొంగుబాటు

Militants Surrender in Assam : ఇంతకాలం సమాజానికి దూరం ఉంటూ ఉద్యమ బాట పట్టినవారు జనజీవన స్రవంతిలో కలిశారు. అసోంలో తీవ్రవాదానికి స్వస్తి పలికిన 1039 మంది మిలిటెంట్లు అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ సమక్షంగా లొంగిపోయారు. అసోంలో ఐదు తీవ్రవాద సంస్థలకు చెందిన 1,039 మంది మిలిటెంట్లు తుపాకులను అప్పగించి ప్రజా జీవితంలోకి వచ్చి సామాన్యులుగా మారిపోయారు.

పీపుల్స్ డెమోక్రటిక్ కౌన్సిల్ ఆఫ్ కర్బీ లాంగ్రీ, కర్బీ లాంగ్రీ ఎన్సీ హిల్స్ లిబరేషన్ ఫ్రంట్, కర్బీ పీపుల్స్ లిబరేషన్ టైగర్, కూకి లిబరేషన్ ఫ్రంట్, యునైటెడ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సంస్థలకు చెందిన 1,039 మంది లొంగిపోయారని అసోం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. బోరోలాండ్ లోని నిషేధిత నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ కమాండర్ సాంగ్ బిజిత్ లొంగిపోయిన వారిలో ఉన్నారు. బోడోలాండ్ జిల్లాలో బిజిత్ మైనారిటీలపై పలు దాడులకు పాల్పడ్డారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు లొంగిపోయిన తీవ్రవాదులకు అసోం సీఎం సోనోవాల్ స్వాగతం పలికారు. అసోంను తీవ్రవాదం నుంచి విముక్తి చేస్తామని సీఎం సోనోవాల్ ప్రకటించారు. బుల్లెట్‌తో కాకుండా బ్యాలెట్‌తో ప్రజాస్వామ్య స్థాపన సాధ్యమని సీఎం సోనోవాల్ తెలిపారు.

ఇదీ చదవండిః కరోనా వైరస్ వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వి’ అత్యవసర వినియోగంపై నేడు చర్చించనున్న నిపుణులు