Psychological Stress: మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారా..? ఒత్తిళ్ల నుంచి బయటపడే చక్కటి మార్గాలు

Psychological Stress: ప్రస్తుత కాలంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెగిపోతోంది. అధిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్లు తదితర..

Psychological Stress: మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారా..? ఒత్తిళ్ల నుంచి బయటపడే చక్కటి మార్గాలు
Follow us
Subhash Goud

|

Updated on: Feb 25, 2021 | 4:02 AM

Psychological Stress: ప్రస్తుత కాలంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెగిపోతోంది. అధిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్లు తదితర కారణాల వల్ల ఎందరో ఆత్మహత్యలకు పాల్పడుతూ తమ విలువైన జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. కానీ ఆత్మహత్య చేసుకుంటే సమస్యకు పరిష్కారం కాదని మానసిక నిపుణులు చెబుతున్నా.. కొందరు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఎన్నో రకాల కారణాలు వెంటాడుతూ ఆత్మహత్యకు కారణమవుతున్నాయి. అంతేకాదు మానసిక ఒత్తిళ్లు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇక కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడటం, ఇప్పుడున్న పరిస్థితులను జయించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక ఆర్థికంగా, మానసికంగా తీవ్ర మైన ఒత్తిళ్లకు లోనవుతున్నారు. అయితే మానసిక ఒత్తిళ్ల నుంచి గట్టెక్కాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.

టెన్షన్‌కు మంచి ఆహారం..

అదిక టెన్షన్‌కు గురవుతున్న సమయంలో మంచి ఆహారం కూడా ఎంతో ఉపయోగపడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. బలమైన ఆహారం తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా మారి ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. శరీరం మొత్తం యాక్టివ్‌ అవుతుంది. విటమిన్స్‌, మినరల్స్‌, మంచి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి.

ఎక్కువగా ఆలోచించవద్దు

కొన్ని కొన్ని విషయాలను పదే పదే ఆలోచించడం వల్ల అధిక ఒత్తిడికి గురై లేనిపోని ఆలోచనలు వచ్చే అవకాశాలుంటాయి. వరుసగా పనులు చేస్తుంటే ఒత్తిడికి గురవుతుంటారు. మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకుంటూ ఉండాలి. అలాగే ఎక్కువగా ఇబ్బంది పెట్టే విషయాలను సైతం చూడడం, వినడం కాని చేయవద్దు. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా మానసికంగా బాగా కుంగిపోతాము. దీంతో ఆనారోగ్య సమస్యలు దరి చేరుతాయి. ఇలా అధిక ఒత్తిడి పెరిగిపోవడం వల్ల ఆరోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఒంటరితనం వద్దు..

ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉండే సమయంలో వీలైనప్పుడు అందరితో కలిసిపోయేలా ఉండాలి. స్నేహితులతో మాట్లాడుతుండాలి. ఏవైనా సమస్యలుంటే వారితో షేర్‌ చేసుకుంటే కొంత కొంత ఒత్తిడి అనేది దూరమవుతుంది. చీకటిలో ఉండకుండా ఫ్రీగా ఉండటం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా నిద్రలేమి సమస్య కూడా ఆరోగ్యానికి గురి చేస్తుంది. ఒత్తిడికి అనేక కారణాల్లో నిద్రలేమి. చాలా మంది రోజూకు నాలుగైదు గంటలు మాత్రమే పడుకుంటారు. మనం ప్రతి రోజు కనీసం ఆరు గంటలైన నిద్రించాలని నిపుణులు చెబుతున్నారు. విశ్రాంతి లేకుండా పనులు చేయడం, యంత్రాల్లో పని చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. మంచి నిద్ర ఖచ్చితంగా అవసరం. అలాంటి సమయంలో సరిగ్గా నిద్రలేకపోతే అనేక అనారోగ్య సమస్యలు దరిచేరుతాయి. అంతేకాదు సమయానికి భోజనం చేయడం, సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటివి తప్పకుండా పాటిస్తే ఒత్తిడి నుంచి జయించవచ్చు.

Also Read: శరీరానికి ఎంతో మేలు చేసే పదార్థాలు.. ఇవి క్రమంగా తీసుకుంటే వాటిని నుంచి తప్పించుకోవచ్చు