శరీరానికి ఎంతో మేలు చేసే పదార్థాలు.. ఇవి క్రమంగా తీసుకుంటే వాటిని నుంచి తప్పించుకోవచ్చు

Forgetfulness: సాధారణంగా మతిమరుపు అనేది చాలా మందికి ఉంటుంది. పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు తదితర కారణాల మతిమరుపు ఉంటుంది. అయితే మతిమరుపునకు ..

శరీరానికి ఎంతో మేలు చేసే పదార్థాలు.. ఇవి క్రమంగా తీసుకుంటే వాటిని నుంచి తప్పించుకోవచ్చు
Follow us

|

Updated on: Feb 22, 2021 | 6:27 PM

Forgetfulness: సాధారణంగా మతిమరుపు అనేది చాలా మందికి ఉంటుంది. పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు తదితర కారణాల మతిమరుపు ఉంటుంది. అయితే మతిమరుపునకు చెక్‌ పెట్టాలంటే కొన్నింటిని పాటిస్తే తప్పకుండా మెరుగవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. .సహజంగా వయసు పెరిగే కొద్ది ఆలోచన సామర్థ్యం తగ్గిపోవడంతోపాటు జ్ఞాపకశక్తి కూడా మందగిస్తుంది.

వెల్లుల్లితో..

వెల్లుల్లితో కూడా మతిమరుపును నివారించవచ్చంటున్నారు నిపుణులు. ఇది తినడం వల్ల మెదడుకు ఆక్సీజన్‌ సరఫరా అయి మెదడు చురుకుగా పని చేస్తుంది. అంతేకాదు మతిమరుపుతో బాధపడేవారికి మంచి ఉపయోగం ఉందంటున్నారు. మతిమరుపునకు కారణమయ్యే అల్జీమర్స్‌ వ్యాధి రాకుండా ఉపయోగపడుతుంది.

బొప్పాయితో..

మతిమరుపునకు బొప్పాయి చెక్‌ పెట్టవచ్చు. ప్రతి రోజు బొప్పాయి పండు తిన్నట్లయితే మతిమరుపు రాకుండా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బొప్పాయి పాలల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీని వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

చేపలు, గుడ్లు:

మాంసాహారం తీసుకునే అలవాటున్నవారు ప్రతిరోజు చేపలను ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్లు మెదడుకు ఆరోగ్యాన్ని అందించిన జ్ఞాపకశక్తి పెంచుతాయి. అంతేకాదు ఒత్తిడి నుంచి కూడా దూరం చేసి సంతోషంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అలాగే గుడ్డులోని విటమిన్‌-బి12, ఫోలేట్‌ జ్ఞాపకశక్తి పెరిగేలా చేస్తాయి. మెదడులో చక్కెర స్థాయిలను తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది.

వీటితో కూడా మతిమరుపు మాయం :

సోంప్‌, ధనియాలు, ఏలకులు, సీమ బాదంపప్పు, పటికబెల్లం విడిగా చూర్ణం చేసి, సమానంగా కలిపి ఉంచుకుని, రోజూ రాత్రి పడుకునే ముందు ఒక స్పూన్‌ పొడిని పాలతో కలిపి తీసుకుంటూ మతిమరుపు తగ్గి, జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుందట.

తృణధాన్యాలు:

తృణధాన్యాలు తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఫైబర్‌ అధికంగా ఉండే తృణధాన్యాలు తినేటప్పుడు, శక్తి శరీరంలో చక్కెర రూపంలో విడుదలవుతుంది. ఇది మెదడు సరిగా పని చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది.