Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Olive Oil : ఆలివ్ ఆయిల్ ఈ రకమైన చర్మం వారు అసలు వాడవద్దు. వాడితే వచ్చే సైడ్ ఫెక్ట్స్ ఏమిటో తెలుసా..!!

గత కొంతకాలంగా ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుండడంతో.. గత కొంతకాలంగా ఆలివ్ ఆయిల్ వాడకం పెరిగింది. అయితే ఇదే ఆలివ్ ఆయిల్ కొంత మందికి కొన్ని కొన్ని సార్లు చర్మ సమస్యలను...

Olive Oil : ఆలివ్ ఆయిల్ ఈ రకమైన చర్మం వారు అసలు వాడవద్దు. వాడితే వచ్చే సైడ్ ఫెక్ట్స్ ఏమిటో తెలుసా..!!
Follow us
Surya Kala

|

Updated on: Feb 24, 2021 | 6:29 AM

Olive Oil : గత కొంతకాలంగా ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుండడంతో.. గత కొంతకాలంగా ఆలివ్ ఆయిల్ వాడకం పెరిగింది. అయితే ఇదే ఆలివ్ ఆయిల్ కొంత మందికి కొన్ని కొన్ని సార్లు చర్మ సమస్యలను కలిగిస్తుంది. మరి పడని వారికి ఈ ఆయిల్ ఆయిల్ వల్ల చర్మానికి కలిగే దుష్ప్రభావాలను గురించి ఈరోజు తెలుసుకుందాం..!

ఆలివ్ ఆయిల్ చర్మానికి వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:

* జిడ్డు చర్మం కలవారు ఈ ఆలివ్ ఆయిల్ ను వాడకూడదు.. ఎందుకంటే ఆలివ్ ఆయిల్ వాడితే.. సీబం అధికంగా ఉత్పత్తి అయ్యి.. చర్మం ఎరుపుగా మారడం, దురదలు మరియు స్కిన్ రాషెష్ కలగడం వంటి అలర్జీలు కలిగే అవకాశం ఉన్నది.. * ఆలివ్ ఆయిల్ ఒలియిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటుంది.. ఇది సహజ తేమను తొలగిస్తుంది కనుక పొడి చర్మం కలిగి ఉన్నవారు ఆలివ్ ఆయిల్ ను వాడకూడదు.. * ఆలివ్ ఆయిల్ చర్మం పై అప్లై చేశాక.. ముఖ్యంగా ముఖం పై రాసుకున్నాక చర్మం గ్రహించుకోవడం కష్టం.. అందుకనే ఈ ఆలివ్ ఆయిల్ చర్మం పై పొరగా ఏర్పడుతుంది. తర్వాత దానిపై దుమ్ము, ధూళి పొరగా పేరుకుపోయి మొటిమలకు కారణం అవుతాయి. *ఇక శిశువుల శరీర తత్వం ఏమిటో తెలియకుండా ఆలివ్ ఆయిల్ పూయడం అంత మంచిది కాదు.. ఆలివ్ ఆయిల్ మసాజ్ కొన్ని సార్లు చిన్న పిల్లలను చికాకుకు గురి చేస్తుంది…. ఐతే ఆలివ్ ఆయిల్ వల్ల చర్మం పై చెప్పుకో దగ్గ ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడవు.. కానీ అలర్జీలు ఉంటే మాత్రం ఆలివ్ ఆయిల్ కు దూరంగా ఉంటే మంచిది.. కావున ఆలివ్ ఆయిల్ ని వాడాలంటే చర్మ వైద్య నిపుణుడిని కలిసి చర్మం రకాన్ని..తెలుసుకొని వాడితే మంచిది.

Also Read:   పాలసీదారులకు గుడ్‌న్యూస్‌: ఎల్‌ఐసీ నుంచి కొత్త పాలసీ ‘బీమా జ్యోతి’ .. పూర్తి వివరాలు..

పెట్రోల్ చింత వద్దు.. ఎలక్ట్రిక్ స్కూటర్లు ముద్దు.. ఈ వాహనాలపై హీరో బంపర్ ఆఫర్..