కొత్తిమీర వంటల్లో రుచికే కాదు.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు.. కీళ్ళ సమస్యలను దూరం చేసే..
భారత్‌లో ప్రతి వంటకాల్లో మరింత రుచిని అందించడానికి కొత్తిమీరను ఉపయోగిస్తుంటాం. ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేకుండా మన ఇంటి పెరట్లో..
భారత్‌లో ప్రతి వంటకాల్లో మరింత రుచిని అందించడానికి కొత్తిమీరను ఉపయోగిస్తుంటాం. ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేకుండా మన ఇంటి పెరట్లో.. లేదా చిన్న చిన్న కుండీల్లో దీనిని సులభంగా పెంచుకోవచ్చు. ఎంతంటి రుచికరమైన వంటకం చేసినా.. దానికి కొత్తిమీర జతచేయకపోతే.. సరిపడా రుచి వచ్చినట్లుగా అనిపించదు. అలాంటి కొత్తిమీర కేవలం వంటకాల్లో రుచికే కాకుండా.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూర్చడమే కాకుండా.. అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. మరీ అవెంటో తెలుసుకుందామా..
★ నోటి దుర్వాసన పొగొడుతుంది..
చాలా మంది ఎక్కువగా వేధిస్తోంది ఈ సమస్య. ఎన్ని రకాల టూత్ పేస్ట్ వాడినా నోటి దుర్వాసను పొగోట్టలేనివారుంటారు. ఇప్పటికీ ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి చాలా మంది ధనియాలు నములుతుంటారు. కొత్తిమీర యాంటీ సెప్టిక్ టూత్ పేస్ట్‌లో తప్పనిసరిగా ఉంటుంది. ఇది నోటి దుర్వాసననే కాకుండా.. నోటి పూతను కూడా తగ్గించడంలో సహయపడుతుంది.
★ మెన్ట్స్రువల్ క్రాంప్స్ తగ్గించడం..
కొత్తిమీర చెట్ల నుంచి వచ్చిన ధనియాల్లో ఎసోర్బిక్ యాసిడ్, పామిటిక్ ఆసిడ్, లైనోలిక్ యాసిడ్, స్టెరిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి హార్మోన్స్ సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. దీంతో మెన్ట్స్రువల్ సక్రమంగా పనిచేయడంతోపాటు నొప్పి కూడా తగ్గిస్తుంది. రాత్రింతా నానాబెట్టిన ధనియాలను ఉదయాన్నే తీసుకోవడం వలన ఇతర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
★ కొలెస్ట్రాల్ రెగ్యూలేట్..
ప్రస్తుతం కాలంలో చాలా మంది శరీరంలో ఎక్కువగా పెరుకుపోయిన కొలెస్ట్రాల్ సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ కొత్తిమీరను జతచేసుకోవడం వలన బాడీలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
★ ఎముకలు దృఢంగ..
ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా కొత్తిమీరను తీసుకుంటుండాలి అని సూచిస్తుంటారు. ఇందులో ఉండే కాల్షియం ఇతర మినరల్స్, బోన్ డిగ్రడేషన్ని ప్రివెంట్ చేస్తాయి, బోన్ రీగ్రోత్కి తొడ్పడతాయి. ఆస్తియోపొరాసిస్ సమస్య ఉన్నవారు రోజూ కొత్తిమీర తీసుకోవడం ఉత్తమం.
★ బ్లడ్ ప్రెజర్ కంట్రోల్..
హైబీపీ ఉన్నవారు కొత్తిమీర సలాడ్ తీసుకోమని వైద్య ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. దీనివల్ల హార్ట్ ఎటాక్స్, గుండె సమస్యలను దూరం చేయవచ్చు.
★ జీర్ణవ్యవస్థకు..
కొత్తిమీర ఆకులు వికారానికీ, అజీర్ణ సమస్యలను తగ్గించేందుకు సహయపడుతుంది. అంతేకాకుండా రోజూవారీ ఆహారంలో దీనిని తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థను మరింత మెరుగుపరుస్తుంది. వీటిలో పైబర్ పుష్కలంగా ఉంటుంది.
★కంటి చూపుకు..
కొత్తిమీర కళ్లకు మంచిదని అంటుంటారు. ఇందులో విటమిన్ ఏ, సీ, యాంటీ ఆక్సిడెంట్స్, ఫాస్పరస్ విజన్ డిసార్డర్స్‌ని ప్రివెంట్ చేస్తాయి. అలాగే కళ్లకు ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇందులో ఉండే బీటా కెరొటిన్ వల్ల వయసు పెరగడం వల్ల వచ్చే డీజెనరేటివ్ ఎఫెక్ట్స్‌ని కొత్తిమీర రివర్స్ చేయగలదు. కండ్ల కలక రాకుండా ప్రివెంట్ చేస్తుంది.
★ ముడతలు లేకుండా..
వయసు పెరగేకొద్ది చాలా మందికి చర్మ సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా చర్మం నిర్జీవంగా మారిపోవడం, ముడతలు రావడం వంటివి జరుగుతుంటాయి. కొత్తిమీర ఆకులు ఫ్రీ రాడికల్స్‌తో ఫైట్ చేసి పిగ్మెంటేషన్, రింకిల్స్, లూజ్ స్కిన్ వంటి అనేక స్కిన్ సమస్యలను తగ్గిస్తాయి. కొత్తిమీర ఆకులకు అలోవెరా జెల్ కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత కడిగేయండి.
★ బ్లాక్ హెడ్స్ తగ్గిస్తుంది.
యాక్నే, బ్లాక్ హెడ్స్ తొలగించడానికి కొత్తిమీర సహయపడుతుంది. కొత్తిమీర ఆకుల పేస్ట్, నిమ్మరసం యాక్నే, బ్లాక్ హెడ్స్ తగ్గిస్తాయి. ఒక టీ స్పూన్ కొత్తి మీర ఆకుల పేస్ట్‌లో ఒక టీ స్పూన్ నిమ్మ రసం కలపండి. సమస్య ఉన్న చోట ఈ మిశ్రమంతో మసాజ్ చేసి ఒక గంట తరువాత చల్లని నీటితో కడిగేయండి.
★ ఆయిలీ స్కిన్..
ముఖం మీద నుండి ఆయిల్ ని అబ్జార్బ్ చేసే లక్షణం కొత్తిమీరకి ఉంది. కొత్తిమీర ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్, డిస్ఇంఫెక్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి అనేక రకాల చర్మ సమస్యల నుండి రిలీఫ్ ని ఇస్తాయి. ఈ ఆకుల్లో ఉండే విటమిన్స్ ఈ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. తాగా కొత్తిమీర రసాన్ని ఫేస్ మీద డైరెక్ట్ గా అప్లై చేయండి. గంట తరువాత కడిగేయండి. లేదంటే కొత్తిమీర ఆకులూ, పాలు కలిపి థిక్ పేస్ట్ లా కూడా చేయవచ్చు. ఈ పేస్త్ ని ముఖానికి పట్టించి పట్టించి పదిహేను నిమిషాల తరువాత కడిగేయండి.
★ పెదవులకు.. పెదవుల మీద నుండి డెడ్ సెల్స్ ని తొలగించి మీ లిప్స్ చక్కగా మెరుస్తూ ఉండేలా చేస్తుంది కొత్తిమీర. రెండు టీ స్పూన్ల కొత్తిమీర జ్యూసులో ఒక టీ స్పూన్ నిమ్మ రసం కలపండి. రోజూ రాత్రి నిద్ర కి ముందు పెదవులకి అప్లై చేసి పడుకోండి. ఇలా కనీసం ఒక వారం పాటు చేయండి.
Also Read:
కలబంద అందానికే కాదు.. బరువును తగ్గిస్తుందట.. అధ్యాయనాల్లో బయటపడుతున్న విషయాలెంటో తెలుసా..