LIC Bima Jyoti Scheme: పాలసీదారులకు గుడ్‌న్యూస్: ఎల్‌ఐసీ నుంచి కొత్త పాలసీ ‘బీమా జ్యోతి’ .. పూర్తి వివరాలు..
LIC Bima Jyoti Scheme:లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) 2021లో కొత్త పాలసీని విడుదల చేసింది. బీమా రక్షణతో పాటు పొదుపునకు ఉపయోగపడేలా దీనిని రూపొందించారు...
LIC Bima Jyoti Scheme:లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) 2021లో కొత్త పాలసీని విడుదల చేసింది. బీమా రక్షణతో పాటు పొదుపునకు ఉపయోగపడేలా దీనిని రూపొందించారు. ‘బీమా జ్యోతి’ పేరుతో తీసుకువచ్చిన ఈ పాలసీని కనీసం రూ. లక్ష నుంచి తీసుకోవచ్చు. ఈ పాలసీకిఎలాంటి గరిష్ఠ పరిమితి లేదని తెలిపింది.
పాలసీ వ్యవధి 15-20 ఏళ్ల వరకు ఎంచుకోవచ్చు:
అయితే పాలసీ వ్యవధి 15 లేదా20 ఏళ్ల వరకు ఎంచుకోవచ్చు. ఇది లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే ప్రీమియం కొంత కాలం పాటే చెల్లిస్తాం. బీమా మాత్రం తర్వాత కొన్నేళ్ల వరకు వర్తిస్తుంది. ఈ కొత్త పాలసీలో ప్రీమియం చెల్లించాల్సిన అవధి మనం తీసుకున్న పాలసీ అవధి కంటే ఐదేళ్లు తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మనం పాలసీ అవధిని 20 ఏళ్లుగా ఎంచుకుంటే ప్రీమియం చెల్లించాల్సింది 15 ఏళ్లు మాత్రమే.
ఇక ఈ పాలసీ ద్వారా అందిస్తున్న మరో ప్రయోజనం ఏంటంటే ఖచ్చితమైన అదనపు చెల్లింపు. ప్రతి రూ.1,000 పాలసీ మొత్తానికి ఏడాదికి రూ.50 జమ చేస్తారు. అంటే ఏడాదికి ఐదు శాతం ఖచ్చితమైన రిటర్న్ లభిస్తుంది. అలాగే జమ అయిన మొత్తాన్ని పాలసీ కాలపరిమితి ముగిసిన తర్వాత చెల్లిస్తారు. ఉదాహరణకు రూ.10 లక్షల పాలసీ 20 ఏళ్లకు తీసుకున్నారు. ఏడాదికి వెయ్యికి రూ.50 లెక్కల రూ. 10 లక్షలకు రూ.50వేల అదనంగా చేరుతాయి. అలా ఇరవై ఏళ్ల పాటు ప్రతి సంవత్సరానికి రూ.50వేల చొప్పున అందుతాయి. పాలసీ కాలపరిమితి ముగిసే నాటికి రూ.10 లక్షలు అదనంగా వచ్చి చేరుతాయి.ఇక దీంట్లో ఎలాంటి బోనస్‌లూ ఉండవు.
కాగా, ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను దృష్టిలో ఉంచుకుని దీనిని తీసుకువచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. ఎఫ్‌డీ రేట్లు ఇటీవల భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. అయితే దీర్ఘకాలంలో ఎఫ్‌డీ వల్ల 5 శాతం రిటర్న్‌వస్తాయనే నమ్మకం ప్రస్తుతానికి లేదనే చెప్పాలి.
పూర్తి వివరాలు…
కనీస పాలసీ మొత్తం – రూ.1,00,000 గరిష్ఠ పరిమతి – లేదు పాలసీ వ్యవధి – 15 లేదా 20 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సింది – 10 లేదా 15 ఏళ్లు ప్రవేశానికి కనీస వయసు – 90 రోజులు ప్రవేశానికి గరిష్ఠ వయసు – 60 ఏళ్లు మెచ్యూరిటీ నాటికి కనీస వయసు – 18 ఏళ్లు మెచ్యూరిటీ నాటికి గరిష్ఠ వయసు – 75 ఏళ్లు
రూ. 10 లక్షల పాలసీ మొత్తంలో 20 ఏళ్ల వ్యవధిని ఎంచుకుంటే వచ్చే లాభాలు
పాలసీ వ్యవధి – 20 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సింది – 15 ఏళ్లు పాలసీ మొత్తం – రూ.10,00,000 ఏడాది ప్రీమియం – రూ. 82,545 అదనపు చెల్లింపులు 20×50,000 కాలపరిమితి ముగిసిన తర్వాత అందే మొత్తం – పాలసీ మొత్తం రూ. 10,00,000 మరియు చెల్లింపులు (రూ.20×50,000)= రూ.20 లక్షలు
Also Read: EPFO: మీరు పీఎఫ్ ఖాతాదారులా..? ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు.. ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే..!