AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drishyam 2 : ‘దృశ్యం 2’ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకీ కథలో మార్పులు చేస్తున్న దర్శకుడు జీతు జోసెఫ్..

మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన 'దృశ్యం' సినిమా అన్ని ప్రధాన భాషల్లో రీమేక్ కాబడి ఘన విజయం సాధించింది. ఓ మిడిల్ క్లాష్ ఫ్యామిలలో అనుకోని సంఘటన కారణంగా కష్టాలు ఎదురైతే ఆ కుటుంబ పెద్ద తన వారిని..

Drishyam 2 : 'దృశ్యం 2' గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకీ కథలో మార్పులు చేస్తున్న దర్శకుడు జీతు జోసెఫ్..
Rajeev Rayala
|

Updated on: Feb 25, 2021 | 9:54 PM

Share

Drishyam 2 movie : మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘దృశ్యం’ సినిమా అన్ని ప్రధాన భాషల్లో రీమేక్ కాబడి ఘన విజయం సాధించింది. ఓ మిడిల్ క్లాష్ ఫ్యామిలలో అనుకోని సంఘటన కారణంగా కష్టాలు ఎదురైతే ఆ కుటుంబ పెద్ద తన వారిని ఎలా కాపాడుకున్నాడన్న కథతో ఈ సినిమా వచ్చింది. జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించారు. ఇక దీనికి సీక్వెల్ గా మలయాళంలో వచ్చిన ”దృశ్యం 2” ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకుంటోంది.దాంతో ‘దృశ్యం2’ హవా మొదలైంది. తెలుగులో వెంకటేశ్‌తో ఈ సినిమా రీమేక్‌ అధికారికంగా అనౌన్స్‌ అయ్యింది. మలయాళ ఒరిజినల్‌ను డైరెక్ట్‌ చేసిన జీతూ జోసెఫే ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడు. అలాగే హిందీలో కూడా దీనివార్తలు మొదలయ్యాయి. అయితే తెలుగు రీమేక్ లో మార్పులు జరగనున్నాయని తెలుస్తుంది.

ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయడానికి సర్వం సిద్దమైంది. ఈ సీక్వెల్ రీమేక్ లో నటించడానికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. తెలుగు వెర్షన్ కు సైతం ఒరిజినల్ మూవీని డైరెక్ట్ చేసిన జీతు జోసెఫ్ దర్శకత్వం వహించబోతున్నారు. తెలుగులో కూడా సీన్ టూ సీన్ తీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు రీమేక్ ని థియేటర్స్ లో ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అనే డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి.  అయితే ఈ చిత్రంలో పలు మార్పులు సూచించాడట వెంకటేష్. రిలీజ్ కు ముందే ఈ చిత్రాన్ని స్పెషల్ స్క్రీన్ లో వీక్షించారు వెంకటేష్. ఆ తర్వాత తన సోదరుడు ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో సుదీర్ఘంగా చర్చించారు. తెలుగు వెర్షన్ కు తగ్గట్టుగా పలు మార్పులు సూచించారట. దీంతో.. దర్శకుడు జీతు జోసెఫ్.. వెంకీ సూచనల ప్రకారం స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారట. కాగా.. ఈ చిత్రాన్ని మొత్తం 50 రోజుల్లోనే పూర్తిచేయబోతున్నారట. జులైలో ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. వెంకీ సరసన మీన హీరోయిన్ గా నటించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sukumar : సినిమా పై ఉప్పెనంత ప్రేమ కురిపించిన మహేష్ బాబుకు థాంక్స్ చెప్పిన సుకుమార్..

Rashmika Mandanna: బాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న రష్మిక.. ముంబైకి మకాం మార్చేస్తున్న లక్కీ బ్యూటీ..

శరవేగంగా పవన్ -క్రిష్ సినిమా షూటింగ్… స్పాట్ నుంచి లీక్ అయిన పవన్ లుక్ ..సోషల్ మీడియాలో వైరల్

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..