శరవేగంగా పవన్ -క్రిష్ సినిమా షూటింగ్… స్పాట్ నుంచి లీక్ అయిన పవన్ లుక్ ..సోషల్ మీడియాలో వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వరుస సినిమాలకు కమిటైన సంగతి తెలిసిందే. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా అటు రాజకీయాలు, ఇటు సినిమా షూటింగ్స్ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు పవన్...

శరవేగంగా పవన్ -క్రిష్ సినిమా షూటింగ్... స్పాట్ నుంచి లీక్ అయిన పవన్ లుక్ ..సోషల్ మీడియాలో వైరల్
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 25, 2021 | 9:11 PM

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వరుస సినిమాలకు కమిటైన సంగతి తెలిసిందే. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా అటు రాజకీయాలు, ఇటు సినిమా షూటింగ్స్ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు పవన్. ఈ నేపథ్యంలో ఇటీవలే తన ‘వకీల్ సాబ్’ షూటింగ్ కంప్లీట్ చేసిన ఆయన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ‘వకీల్ సాబ్’ షూటింగ్ ఫినిష్ కావడంతో మళయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగు రీమేక్‌‌ సెట్స్ పైకి వచ్చేశారు పవన్ కళ్యాణ్. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

అయితే ఈ మూవీతో పాటు ప్యారలల్‌గా క్రిష్ సినిమాను కూడా పట్టాలెక్కించేసారు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా మొగలాయిలా కాలంనాటి కథతో తెరకెక్కుతుందని తెలుస్తుంది. రాజకీయాల్లో ఉన్నంతకాలం గుబురు గడ్డం, మీసాలతో కనిపించిన పవన్ కళ్యాణ్.. గడ్డం తీసేసి కొత్తగా కనిపించగానే అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు ఫోటోలను. అయితే లేటెస్ట్ లుక్ మాత్రం క్రిష్ సినిమా కోసమేఅంటూ వార్తలు వచ్చాయి.

ఇప్పుడు సినిమా సెట్ నుంచి పవర్ స్టార్ ఫొటో లీక్ కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పడు ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. త్వరలోనే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. పవన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవబోతున్న ఈ మూవీని.. దాదాపు 170 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమాకు ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది కాగా.. షూటింగ్ స్పాట్ నుంచి పవన్ లేటెస్ట్ పిక్ ఒకటి రిలీజ్ అయ్యింది. ఈ ఫొటోలో పవన్ పీరియాడికల్ లుక్ లో కనిపిస్తున్నారు. కాగా మహాశివరాతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రాబోతుందని ఫిలిం నగర్ లో టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Love Story movie : నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ కోసం రంగంలోకి సమంత.. మరో మాస్ బీట్ తో రానున్న ఫిదా బ్యూటీ..

Mosagallu Movie :’డబ్బు ఉన్న వాడి దగ్గర డబ్బు కొట్టేయడం తప్పేమి కాదు’..ఆకట్టుకుంటున్న మోసగాళ్లు ట్రైలర్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!