Mosagallu Movie :’డబ్బు ఉన్న వాడి దగ్గర డబ్బు కొట్టేయడం తప్పేమి కాదు’..ఆకట్టుకుంటున్న మోసగాళ్లు ట్రైలర్..

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో మంచువారబ్బాయి విష్ణు ఒకరు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల కాలంలో కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ టాల్ హీరో ఇప్పుడు లైన్ గా సినిమాలు చేస్తున్నాడు.

  • Rajeev Rayala
  • Publish Date - 6:35 pm, Thu, 25 February 21
Mosagallu Movie :'డబ్బు ఉన్న వాడి దగ్గర డబ్బు కొట్టేయడం తప్పేమి కాదు'..ఆకట్టుకుంటున్న మోసగాళ్లు ట్రైలర్..

Mosagallu Movie Trailer : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో మంచువారబ్బాయి విష్ణు ఒకరు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల కాలంలో కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ టాల్ హీరో ఇప్పుడు లైన్ గా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మోసగాళ్లు అనే సినిమాను పూర్తి చేసాడు. తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ ‌ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

కాగా ఈ సినిమాలో విష్ణు చెల్లెలిగా చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుంది. కాజల్ ఇటీవలే పెళ్లిపీటలెక్కిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఆమె వివాహమాడింది. ప్రస్తుతం కాజల్ తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తుంది. ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య. మరొకటి మోసగాళ్లు. ఇక మోసగాళ్లు సినిమాలోబాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. సునీల్ లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన నెగిటివ్ పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. కన్నడ స్టార్ హీరో సుదీప్ కిచ్చ నటించిన పహిల్వాన్ సినిమాలో విలన్ గా నటించారు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్భార్ సినిమాలో ప్రతినాయకుడిగా నటించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు మోసగాళ్లు సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఎకానమీ బేసిస్‌లో జనరేషన్స్ మధ్య కల్చరల్ క్లాష్, ధనిక పేద మధ్య తేడాలను ఈ మూవీలో డైరెక్టర్ అత్యద్భుతంగా చూపించబోతున్నారని సమాచారం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ,పాటలు సినిమాపై అంచనాలను,ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయడం విశేషం. ఇండస్ట్రీ లో మోహన్ బాబు, చిరంజీవి ఫ్యామిలీ ఎంతో సన్నిహితంగా ఉంటారన్న విషయం తెలిసిందే. ఇక ఈ ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచింది.

‘డబ్బు సంతోషాన్ని ఇస్తుందనుకున్నా.. డబ్బు సెక్యూరిటీ ఇస్తుందనుకున్నా.. ఒట్టేసుకున్నా ఈ పేదరికం నుంచి దూరంగా వెళ్లిపోవాలని..” అంటూ మంచు విష్ణు చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. తెలివితేటలతో టెక్నాలజీని వాడుకుని అమెరికాలో రూ.2600 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన ఇండియన్స్ కథను ఇందులో చూపిస్తున్నట్లు చూపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో నవదీప్ – నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. కుంభకోణానికిపాల్పడిన వ్యక్తులను పట్టుకునే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సునీల్ శెట్టి కనిపించా రు. అలాగే లక్ష్మీ దేవి అంత రిచ్ ఎందుకో తెలుసా నాలుగు చేతులతో సంపాదిస్తుంది కాబట్టి’ అంటూ కాజల్ చెప్పే డైలాగ్ తో పాటు ‘డబ్బు ఉన్న వాడి దగ్గర డబ్బు కొట్టేయడం తప్పేమి కాదనే’ డైలాగ్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Gangubai Kathiawadi : ‘గంగూబాయి కతియావాడి’ కోసం ముందుగా ఆ బ్యూటీ అనుకున్నారట.. కానీ ఆమె నో అనడంతో..

డిజిటల్ మీడియా, ఓటీటీపై కేంద్రం కళ్లెం.. హద్దుమీరితే కఠిన చర్యలు.. పిల్లలు చూడకుండా నియంత్రణ.. ఫోటో స్టోరీ

Check Movie : రిలీజ్‌కు రెడీ అవుతున్న నితిన్ ‘చెక్’ మూవీ.. వెరైటీగా విషెస్ తెలిపిన ‘రంగ్ దే’ టీమ్..

Priyanka Chopra : ప్రియాంకా చోప్రను ట్రోల్ చేస్తున్న నెటిజనులు.. థ్యాంక్స్ చెప్పి షాక్ ఇచ్చిన గోబల్ బ్యూటీ.. ఇంతకు ఏమైందంటే..