AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Check Movie : రిలీజ్‌కు రెడీ అవుతున్న నితిన్ ‘చెక్’ మూవీ.. వెరైటీగా విషెస్ తెలిపిన ‘రంగ్ దే’ టీమ్..

యంగ్‌ హీరో నితిన్‌... కొత్త ఏడాదిలోనూ వరుస సినిమాలను ప్లాన్‌ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ‘రంగ్‌ దే’, ‘చెక్‌’, అంధాధున్‌ రీమెక్‌లో నటిస్తున్నారు. అయితే వాటిలో మొదటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ ..

Check Movie : రిలీజ్‌కు రెడీ అవుతున్న నితిన్ 'చెక్' మూవీ.. వెరైటీగా విషెస్ తెలిపిన 'రంగ్ దే' టీమ్..
Rajeev Rayala
|

Updated on: Feb 25, 2021 | 4:39 PM

Share

Check Movie : యంగ్‌ హీరో నితిన్‌… కొత్త ఏడాదిలోనూ వరుస సినిమాలను ప్లాన్‌ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ‘రంగ్‌ దే’, ‘చెక్‌’, అంధాధున్‌ రీమెక్‌లో నటిస్తున్నారు. అయితే వాటిలో మొదటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ చేస్తున్న ‘రంగ్ దే’ విడుదలవుతుందని ఆ తరవాతే ‘చెక్’ వస్తుందని అందరూ భావించారు. కానీ ప్లాన్ రివర్స్ అయింది. రంగ్‌ దే( మార్చి 26న విడుదల) కంటే ముందే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ‘చెక్‌’ సినిమా విడుదల కానుంది. చెక్ ను ఫిబ్రవరి 26న ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నితిన్ ఖైదీగా కనిపిస్తుండటం కూడ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన భీష్మ సినిమాతో గత ఏడాది సాలిడ్ హిట్ అందుకున్నాడు నితిన్. ఆతర్వాత విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.

తీవ్రవాది అనే ముద్రపడి జైలు జీవితం అనుభవిస్తున్న యువకుడి కథతో ఈ సినిమా రాబోతుంది. అసలు అతను చేసిన నేరం ఏంటి.. ఎందుకు దేశద్రోహి అనే ముద్రపడింది. జైలునుంచి హీరో ఎలా బయట పడ్డాడు,జైలులో ఉన్న హీరో చెస్ లో గ్రాండ్ మాస్టర్ ఎలా అయ్యాడు అనేవి సినిమాపై అంచనాలను , ఆసక్తిని పెంచాయి. అంతే కాకుండా చెక్ సినిమా మొత్తం చెస్ గేమ్ చుట్టూ తిరుగుతుందని అర్ధమవుతుంది. చెక్ సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో సెలబ్రెటీలు చిత్రయూనిట్ కు నితిన్ కు విషెస్ తెలుపుతున్నారు.

ఈ క్రమంలో నితిన్ నెక్స్ట్ మూవీ ‘రంగ్ దే’ చిత్రయూనిట్ నితిన్ ‘చెక్’ సినిమాకు వెరైటీగా విషెస్ తెలిపారు. హీరోయిన్ కీర్తి సురేష్, కమెడియన్ వెన్నెల కిషోర్, దర్శకుడు వెంకీ అట్లూరి ముగ్గురు కలిసి చెస్ గేమ్ ఆడుతూ నితిన్ కు విషెస్ తెలిపారు. ఇందుకు సంభందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ వీడియోలో డైరెక్టర్ వెంకీతో పాటు కీర్తిసురేష్ వెన్నెలకిషోర్ చెస్ ఆడుతూ కనిపించారు. చివరిగా వీడియోలోకి నితిన్ ఎంటరవుతాడు. వెంటనే కీర్తిసురేష్ వెంకీ వెన్నెలకిషోర్.. హీరో నితిన్ కు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు.

మరిన్ని ఇక్కడ చదవండి.

Priyanka Chopra : ప్రియాంకా చోప్రను ట్రోల్ చేస్తున్న నెటిజనులు.. థ్యాంక్స్ చెప్పి షాక్ ఇచ్చిన గోబల్ బ్యూటీ.. ఇంతకు ఏమైందంటే..

Thalaivi: ‘తలైవి’ వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్‌ను ప్రకటించిన మూవీమేకర్స్.. ఎప్పుడో తెలుసా?

పవన్, క్రిష్ మూవీ అప్‎డేట్.. ఫస్ట్ లుక్, టైటిల్ విడుదలకు టైం ఫిక్స్.. ఎప్పుడంటే ..