పవన్, క్రిష్ మూవీ అప్‎డేట్.. ఫస్ట్ లుక్, టైటిల్ విడుదలకు టైం ఫిక్స్.. ఎప్పుడంటే ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత దూసుకుపోతున్నాడు. పవన్ రీఎంట్రీతో మొదట నటించిన సినిమా

  • Rajitha Chanti
  • Publish Date - 9:05 am, Thu, 25 February 21
పవన్, క్రిష్ మూవీ అప్‎డేట్.. ఫస్ట్ లుక్, టైటిల్ విడుదలకు టైం ఫిక్స్.. ఎప్పుడంటే ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత దూసుకుపోతున్నాడు. పవన్ రీఎంట్రీతో మొదట నటించిన సినిమా “వకీల్ సాబ్” విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా.. పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అటు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో “అయ్యప్పనుమ్ కోషియమ్” రీమేక్‏లో కూడా పవన్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో దగ్గుపాటి రానా కూడా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో మూవీలో నటించనున్నాడు. తాజాగా పవన్, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

పవన్, క్రిష్ కాంబినేషన్‏లో తెరకెక్కుతున్న ఈ సినిమా 200 ఏళ్ళ కిందట జరిగిన కథ. అయితే ఈ చిత్రానికి “హరిహర వీరమల్లు” అనే టైటిల్‏ను ఫిక్స్ చేసినట్లుగా గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో పవన్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని.. అలాగే ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. పవన్, క్రిష్ కాంబోలో రూపొందుతున్న సినిమా పై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్‏లుక్ పోస్టర్, టైటిల్‏ను మార్చి 11న శివరాత్రి సందర్బంగా విడుదల చేయనున్నట్లుగా టాక్. పవన్‌ ఇప్పటి వరకు పోషించని వైవిధ్య పాత్ర పోషిస్తున్నారు. పవన్ కు జోడీగా నిధి అగర్వాల్‌ హీరోయిన్‏గా నటిస్తోంది. బాలీవుడ్‌ హీరోయిన్ జాక్వెలిన్‌ ఫెర్నాండజ్ కీలక పాత్రలో కనిపించనున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం చార్మినార్‌ నేపథ్యంలో సాగే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం భారీ సెట్‌నే రూపొందించారు. ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పవన్‌ కల్యాణ్‌ ప్రీలుక్‌ సినిమాపై అంచనాలు పెంచుతోంది.

ఇక టైటిల్ విషయానికోస్తే.. ఈ మూవీకి టైటిల్  ‘గజదొంగ’, ‘అంతర్వాహిని’, ‘బందిపోటు’,‘హరిహర వీరమల్లు’ పేర్లను పరిశీలిస్తున్నాడట క్రిష్. మరి వీటిలో ఏ టైటిల్‌ తీసుకోబోతున్నారు.. లేదా ఇంకేదైన కొత్త పేరు తెరపైకి వస్తుందా? తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read:

Gopichand : మ్యాచో హీరోకి హీరోయిన్ కష్టాలు.. మారుతి సినిమాలో చివరకు ఆ హీరోయిన్ ను ఫిక్స్ చేశారట..