Actor Vijay Devarakonda: లక్కీ ఛాన్స్ కొట్టేసిన విజయ్ దేవరకొండ.. ఆ క్యాలెండర్‏ షూట్‏లో యంగ్ హీరో..

"అర్జున్ రెడ్డి" సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత  "గీతా గోవిందం"లో ఏమీ తెలియని అమాయకుడిలా, "అర్జున్‌ రెడ్డి"లో

Actor Vijay Devarakonda: లక్కీ ఛాన్స్ కొట్టేసిన విజయ్ దేవరకొండ.. ఆ క్యాలెండర్‏ షూట్‏లో యంగ్ హీరో..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 25, 2021 | 11:45 AM

“అర్జున్ రెడ్డి” సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత  “గీతా గోవిందం”లో ఏమీ తెలియని అమాయకుడిలా, “అర్జున్‌ రెడ్డి”లో అందరినీ ఎదిరించే రౌడీలా నటించడం ఒక్క విజయ్‌ దేవరకొండకే చెల్లింది. ఏ పాత్ర అయినా అందులో పరకాయ ప్రవేశం చేసే విజయ్‌ ప్రస్తుతం “లైగర్‌. ” సాలా క్రాస్‌ బ్రీడ్”‌ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు తొలిసారిగా బాక్సర్‌గా కనిపించనున్నాడు. పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్మాతగా పని చేస్తున్నాడు. ఈ సినిమా ముంబై నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో చిత్రయూనిట్‌ ఫిబ్రవరి నెలారంబంలోనే ముంబైకి మకాం మార్చింది. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా క్రేజీ హీరో విజయ్ లక్కి ఛాన్స్ కొట్టేసాడు.

అసలు విషయం ఏంటంటే.. ప్రముఖ ఫోటోగ్రాఫర్‌ డబూ రత్నాని క్యాలెండర్‌ షూట్‌లో తొలిసారిగా పాల్గొన్నాడు విజయ్. ప్రతీ సంవత్సరం ప్రముఖ స్టార్‌ హీరో, హీరోయిన్లతో డబూ రత్నాని కాలెండర్‌ షూట్‌ నిర్వహిస్తారు. ఇందులో ఇప్పటికే ఐశ్వర్యరాయ్‌, కియారా అద్వానీ, షారుఖ్‌ ఖాన్‌, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్ , అభిషేక్ బచ్చన్ వంటి పాపులర్‌ స్టార్స్‌ డబూ రత్నాని ఫోటోలకు ఫోజులిచ్చారు. తాజాగా ఈ ఏడాది 2021 కాలెండర్‌ షూట్‌లో విజయ్‌ హ్యాండ్‌సమ్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూట్‌ పూర్తి చేసినట్లు డబూ రత్నాని తెలిపారు. ప్రస్తుతం విజయ్..‌ మాస్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వస్తున్న ‘లైగర్‌’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చార్మీ, కరణ్‌ జోహార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీతో పాటు తమిళం కన్నడ మాలయాళ బాషాల్లో సెప్టెంబర్‌ 9న విడుదల కానున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్‌ ప్రకటించింది.  ఇందులో విజయ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‏గా నటిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో విజయ్ తల్లిగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తుంది. ఇటీవలే రమ్యకృష్ణ మూవీ షూటింగ్ లో జాయిన్ అయింది. విజయ్ తో కలిసి దిగిన ఫోటోను రమ్యకృష్ణ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా తర్వాత సుకుమార్, శివ నిర్వాణ దర్శకత్వాల్లో విజయ్‌ దేవరకొండ నటించనున్నారు.

Also Read:

ఎప్పుడో రాసిన లెటర్‌‌‌‌‌‌‌కు ఇప్పటికి రిప్లే వచ్చినట్టుందట.. ఇంతకు లెక్కల మాస్టర్‌‌‌‌‌కు లేఖ రాసింది ఎవరో తెలుసా..

వన్, క్రిష్ మూవీ అప్‎డేట్.. ఫస్ట్ లుక్, టైటిల్ విడుదలకు టైం ఫిక్స్.. ఎప్పుడంటే ..

ఎప్పుడో రాసిన లెటర్‌‌‌‌‌‌‌కు ఇప్పటికి రిప్లే వచ్చినట్టుందట.. ఇంతకు లెక్కల మాస్టర్‌‌‌‌‌కు లేఖ రాసింది ఎవరో తెలుసా..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!