AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎప్పుడో రాసిన లెటర్‌‌‌‌‌‌‌కు ఇప్పటికి రిప్లే వచ్చినట్టుందట.. ఇంతకు లెక్కల మాస్టర్‌‌‌‌‌కు లేఖ రాసింది ఎవరో తెలుసా..

టాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ సుకుమార్ కు  రీసెంట్ గా  ఓ లెటర్ వచ్చింది. ఇక ఆ లెటర్‌ని చూసి.. అప్పుడెప్పుడో చిన్నప్పుడు తాను రాసిన లెటర్‌కు రిప్లై ఇదేనంటూ.. తెగ సంబంరపడిపోతున్నాడు ఈ లెక్కల మాస్టర్‌.

ఎప్పుడో రాసిన లెటర్‌‌‌‌‌‌‌కు ఇప్పటికి రిప్లే వచ్చినట్టుందట.. ఇంతకు లెక్కల మాస్టర్‌‌‌‌‌కు లేఖ రాసింది ఎవరో తెలుసా..
Rajeev Rayala
|

Updated on: Feb 24, 2021 | 9:37 PM

Share

Sukumar: టాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ సుకుమార్ కు  రీసెంట్ గా  ఓ లెటర్ వచ్చింది. ఇక ఆ లెటర్‌ని చూసి.. అప్పుడెప్పుడో చిన్నప్పుడు తాను రాసిన లెటర్‌కు రిప్లై ఇదేనంటూ.. తెగ సంబంరపడిపోతున్నాడు ఈ లెక్కల మాస్టర్‌. ఇంతకీ ఆ లెటర్‌ ఎవరు రాశారో తెలుసా..? ఇంకెవరు.. మన మెగాస్టార్ చిరంజీవి. మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా `ఉప్పెన` బ్లాక్‌బస్టర్ కావడం మెగాస్టార్ చిరంజీవికి విపరీతంగా హ్యీపీనిచ్చింది. ఇక ఆ హ్యీపీని `ఉప్పెన` యూనిట్ సభ్యులతో పంచుకోవాలనుకున్న మెగాస్టార్‌ చిరంజీవి.. ఈ టీంకు గిఫ్ట్‌ విత్‌ అభినందన లెటర్లు పంపిస్తున్నారు. ఇప్పటికే ఈ గిఫ్ట్‌ కమ్‌ లెటర్లు.. బేబమ్మకు.. డైరెక్టర్ కు అందగా.. ఇక ఇప్పుడు ఈ సినిమాకు హార్ట్‌ఫుల్‌గా సపోర్ట్‌ చేసిన సుకుమార్కు కూడా అందింది. సుకుమార్‌ను ప్రశంస్తూ ఓ లెటర్‌ అండ్‌ స్పెయిన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ `లాడ్రో`స్‌ `ది థ్రిల్‌ ఆఫ్‌ లవ్‌ కపుల్‌ ఫిగరైన్` బొమ్మను గిఫ్ట్‌గా పంపించాడు. ఇక చిరు నుంచి ఈ బహుమతి రావడంతో సుకుమార్‌ ఉబ్బితబ్బైపోయాడు. `కొణిదెల చిరంజీవి, మద్రాసు, ఇండియా.. ఈ అడ్రస్‌కు చిన్నప్పుడు అమాయకంగా రాసిన లేఖలకు ఇప్పుడు ప్రతిలేఖ వచ్చినంత అనుభూతి..!` కలుగుతోందని తన స్టైల్‌లో ఆ ఫీలింగ్స్‌ను సోషల్ మీడియాలో షేర్‌ చేసుకున్నారు.. సుకుమార్‌.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Gopichand : మ్యాచో హీరోకి హీరోయిన్ కష్టాలు.. మారుతి సినిమాలో చివరకు ఆ హీరోయిన్ ను ఫిక్స్ చేశారట..

ఆ 12 సినిమాలు చిరంజీవిని హీరోగా నిలబెట్టాయి..
ఆ 12 సినిమాలు చిరంజీవిని హీరోగా నిలబెట్టాయి..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..