ఘనంగా డైరెక్టర్ సుకుమార్ కూతురి ఫంక్షన్.. సందడి చేసిన టాలీవుడ్ స్టార్ కపుల్స్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..

డైరెక్టర్ సుకుమార్ కూతురి ఫంక్షన్లో పలువురు టాలీవుడ్ సెలబ్రెటీ కపుల్స్ సందడి చేశారు. అక్కినేని నాగచైతన్య ఆయన సతిమణి సమంత, మహేష్ బాబు ఆయన భార్య

ఘనంగా డైరెక్టర్ సుకుమార్ కూతురి ఫంక్షన్.. సందడి చేసిన టాలీవుడ్ స్టార్ కపుల్స్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 25, 2021 | 1:02 PM

డైరెక్టర్ సుకుమార్ కూతురి ఫంక్షన్లో పలువురు టాలీవుడ్ సెలబ్రెటీ కపుల్స్ సందడి చేశారు. అక్కినేని నాగచైతన్య ఆయన సతిమణి సమంత, మహేష్ బాబు ఆయన భార్య నమ్రత, జూనియర్ ఎన్టీఆర్ సతిమణి ప్రణీతతో కలిసి జంటగా వచ్చి కనువిందు చేశారు. ఇక ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‏గా అక్కినేని నాగచైతన్య, సమంత కనిపించారు. ఈ వేడుకకు హాజరైన నాగచైత్యన అచ్చం వారి తండ్రిలాగే కనిపించారు. ఇక సమంత మోడ్రన్ డ్రెస్సులో ఈ ఫంక్షన్లో ఫోకస్ అయ్యింది. ఇక మహేష్, ఎన్టీఆర్ సింప్లీ లుక్‏లో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక రామ్ చరణ్, చిరంజీవి ఆచార్య సినిమా చిత్రీకరణంలో బిజీగా ఉండడంతో ఈ ఫంక్షన్ కు హాజరుకాలేదు. అల్లు అరవింద్, అల్లు శిరీశ్ ఈ వేడుకకు హాజరయ్యారు.

ప్రస్తుతం సుకుమార్ “పుష్ప” సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీని తెరకెక్కిస్తుండగా.. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‏తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే మారేడు పల్లి అడవుల్లో ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. మరికొద్ది రోజుల్లో షూటింగ్ కేరళకు వెళ్లనుంది చిత్రయూనిట్. పుష్ప సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండతో కలిసి ఓ సినిమా చేయనున్నాడు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. సుకుమార్, విజయ్ కాంబోలో రాబోయే చిత్రం పిరియాడిక్ జానర్లో ఉండబోతున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా… ఈ రెండు సినిమాలతోపాటు సుకుమార్ ఓ వెబ్ సిరీస్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:

Actor Vijay Devarakonda: లక్కీ ఛాన్స్ కొట్టేసిన విజయ్ దేవరకొండ.. ఆ క్యాలెండర్‏ షూట్‏లో యంగ్ హీరో..

పవన్, క్రిష్ మూవీ అప్‎డేట్.. ఫస్ట్ లుక్, టైటిల్ విడుదలకు టైం ఫిక్స్.. ఎప్పుడంటే ..

వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?