Priyanka Chopra : ప్రియాంకా చోప్రను ట్రోల్ చేస్తున్న నెటిజనులు.. థ్యాంక్స్ చెప్పి షాక్ ఇచ్చిన గోబల్ బ్యూటీ.. ఇంతకు ఏమైందంటే..

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అందం గురించి ,స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడి స్టైల్ కు బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతుంటారు. వింత వింత డ్రస్ లతో హొయలు ఒలక బోసే ప్రియాంక చోప్రా ఇటీవల ఓ వెరైటీ డ్రస్ తో అందరికి షాక్ ఇచ్చింది.

Priyanka Chopra : ప్రియాంకా చోప్రను ట్రోల్ చేస్తున్న నెటిజనులు.. థ్యాంక్స్ చెప్పి షాక్ ఇచ్చిన గోబల్ బ్యూటీ.. ఇంతకు ఏమైందంటే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 25, 2021 | 3:53 PM

Priyanka Chopra: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అందం గురించి ,స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడి స్టైల్ కు బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతుంటారు. వింత వింత డ్రస్ లతో హొయలు ఒలక బోసే ప్రియాంక చోప్రా ఇటీవల ఓ వెరైటీ డ్రస్ తో అందరికి షాక్ ఇచ్చింది. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రెటీలు ఏ మాత్రం అతి చేసినా కూడా ఒక రేంజ్ లో ట్రోలింగ్ చేయడం కామన్ గా మారింది. చిన్న పొరపాటు చేసిన సోషల్ మీడియాలో క్షణాల్లో ట్రోల్ చేసేస్తుంటారు నెటిజన్లు కొందరు.

ఇక ప్రియాంక బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ సినిమాలతోను మెప్పిస్తూ గ్లోబల్ బ్యూటీ మారిన విషయం తెలిసిందే. మాజీ మిస్ వరల్డ్ అయిన ప్రియాంకా చోప్రా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కు రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. పాప్ సింగర్ నిక్ జోనస్ ను ప్రియాంక పెళ్లాడిన విషయం తెల్సిందే.. తనకంటే దాదాపు 10 ఏళ్ళ చిన్నవాడిని పెళ్ళాడి ఈ అమ్మడు అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మారో సారి నెట్టింటి ప్రియాంక చర్చాంశంగా మారింది  పెళ్లి చేసుకున్న తరువాత మకాం అమెరికాకి మార్చేసినప్పటికి సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.

గ్లోబల్ స్టార్ అయినా తర్వాత ప్రియాంక డ్రసింగ్ స్టైల్ చాలా మారిపోయింది. గతంలో పలుసార్లు స్కిన్ షో చేస్తూ ప్రియాంక వేసుకున్న డ్రస్స్ లు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడి డ్రస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రియాంక డ్రస్ పైన సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల ట్రోల్ చేస్తున్నారు. ఇంతకు ప్రియాంక డ్రెస్ ఎలా ఉందంటే..

గ్రీన్ కలర్ లో గుండ్రంగా బంతిలా ఉన్నడ్రస్ లో మెరిసింది ప్రియాంక. ఆ డ్రస్ తో పీసీ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ ఫోటోలు క్షణల్లో వైరల్ అయ్యాయి. ఇక నెటిజన్లు ఈ ఫొటోస్ పై రకరకాల మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. చిన్నపిల్లలు చూసే పోకెమోన్ ఫొటోలతో జత చేసి ట్రోల్ చేస్తున్నారు. అలాగే ప్రియాంక ను విరాట్ కోహ్లీ క్యాచ్ పడుతున్నట్టు కూడా మీమ్స్ క్రియేట్ చేశారు, ఇదిలా ఉంటే ఈ ట్రోల్స్ పైన ప్రియాంక పాజిటివ్ గా స్పంచించడం విశేషం. ఇప్పుడు పీసీ పైన చేసిన ట్రోల్స్ కూడా సోషల్ మీడియాలో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా, ప్రియాంక చోప్రా ఇటీవల తన ఆత్మకథ అన్‌ఫినీష్డ్ అనే పుస్తకాన్ని పాఠకుల ముందుకు తీసుకొచ్చారు. తన ఆత్మకథ పుస్తకం మార్కెట్‌లో సూపర్ హిట్ అయింది. ఈ పుస్తకానికి విశేష స్పందన లభిస్తున్నది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Thalaivi: ‘తలైవి’ వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్‌ను ప్రకటించిన మూవీమేకర్స్.. ఎప్పుడో తెలుసా?

Priya Prakash Varrier Photos :క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న కుర్రది..!అమ్మడి ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫిదా అవుతున్న కుర్రకారు

ఘనంగా డైరెక్టర్ సుకుమార్ కూతురి ఫంక్షన్.. సందడి చేసిన టాలీవుడ్ స్టార్ కపుల్స్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!