AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Story movie : నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ కోసం రంగంలోకి సమంత.. మరో మాస్ బీట్ తో రానున్న ఫిదా బ్యూటీ..

టాలీవుడ్ లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. మంచి కాఫీ లాంటి అందమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో ఈ దర్శకుడు దిట్ట. సహజత్వం ఉట్టిపడేలా ఉంటాయి శేఖర్ కమ్ముల సినిమాలు.

Love Story movie : నాగచైతన్య 'లవ్ స్టోరీ' కోసం రంగంలోకి సమంత.. మరో మాస్ బీట్ తో రానున్న ఫిదా బ్యూటీ..
Rajeev Rayala
|

Updated on: Feb 25, 2021 | 7:20 PM

Share

Love Story movie : టాలీవుడ్ లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. మంచి కాఫీ లాంటి అందమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో ఈ దర్శకుడు దిట్ట. సహజత్వం ఉట్టిపడేలా ఉంటాయి శేఖర్ కమ్ముల సినిమాలు. ‘డాలర్ డ్రీమ్స్’.. ఫస్ట్ సినిమాతోనే పలు అవార్డులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత కొత్తవాళ్లతో, తక్కువ బడ్జేట్ లో తీసిన సినిమా ‘ఆనంద్’. మంచి కాఫీ లాంటి సినిమా తెరకెక్కించి శబాష్ అనిపించుకున్నారు.

తెలుగు ప్రజల మాదిలో గుర్తుండిపోయే ఎన్నో సినిమాలు తెరకెక్కించాడు శేఖర్. ఫిదా సినిమాతో సాయి పల్లవిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసాడు. ప్రేమమ్ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి ఆతర్వాత తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంది. యంగ్ హీరోలందరూ ఈ టాలెంటడ్ హీరోయిన్నే ప్రిఫర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ అమ్మడితో రెండో సినిమా చేస్తున్నాడు.నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రం లవ్ స్టోరీ కావడంతో ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపైన అంచనాలను పెంచేసాయి.

ఈ సినిమాలో ఇద్దరు డ్యాన్సర్ల జీవన శైలిని చూపించనున్నారు. చైతు , సాయిపల్లవి ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఈ సినిమాను సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నారాయణ దాస్ కె.నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ నిర్మాతలుగా ఉన్నారు.ఇక లవ్ స్టోరీలో హీరోగా నటించిన నాగ చైతన్య విషయానికొస్తే.. వరుసగా మజిలీ, వెంకీ మామ సక్సెస్‌లతో మంచి ఊపు మీదున్నాడు. ఇపుడు తన ఫ్యామిలీ ఇమేజ్‌కు తగ్గట్టు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తోన్నాడు.

కాగా స్వతహాగా డ్యాన్సర్ అయి సాయిపల్లవి మాస్ సాంగ్స్ కు తన డ్యాన్స్ తో అందరిని ఫిదా చేసేస్తోంది. తాజాగా అలాంటి సాంగ్ తోనే రాబోతుంది ఇప్పుడు. ‘సారంగ దరియా’ అంటూ సాగిపోయే ఈ సాంగ్ లో మరోసారి తన టాలెంట్ చూపించిందట. ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 10.08 గంటలకు ఈ పాటను అక్కినేని కోడలు పిల్ల సమంత విడుదల చేయబోతుంది. ఈ మేరకు పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Mosagallu Movie :’డబ్బు ఉన్న వాడి దగ్గర డబ్బు కొట్టేయడం తప్పేమి కాదు’..ఆకట్టుకుంటున్న మోసగాళ్లు ట్రైలర్..

Gangubai Kathiawadi : ‘గంగూబాయి కతియావాడి’ కోసం ముందుగా ఆ బ్యూటీ అనుకున్నారట.. కానీ ఆమె నో అనడంతో..

Check Movie : రిలీజ్‌కు రెడీ అవుతున్న నితిన్ ‘చెక్’ మూవీ.. వెరైటీగా విషెస్ తెలిపిన ‘రంగ్ దే’ టీమ్..