Rashmika Mandanna: బాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న రష్మిక.. ముంబైకి మకాం మార్చేస్తున్న లక్కీ బ్యూటీ..

ఛలో' అంటూ టాలీవుడ్ గడపతొక్కిన కన్నడ భామ రష్మిక మందన.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ కొట్టేసింది. వరుస సక్సెస్‌లతో సత్తా చాటుతున్న ఈ భామ.. ఈ ఏడాది ''సరిలేరు నీకెవ్వరు, భీష్మ'' రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఖాతాలో వేసుకొని సూపర్ జోష్‌లో ఉంది.

Rashmika Mandanna: బాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న రష్మిక.. ముంబైకి మకాం మార్చేస్తున్న లక్కీ బ్యూటీ..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 25, 2021 | 9:25 PM

Rashmika Mandanna:  ఛలో’ అంటూ టాలీవుడ్ గడపతొక్కిన కన్నడ భామ రష్మిక మందన.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ కొట్టేసింది. వరుస సక్సెస్‌లతో సత్తా చాటుతున్న ఈ భామ.. ఈ ఏడాది ”సరిలేరు నీకెవ్వరు, భీష్మ” రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఖాతాలో వేసుకొని సూపర్ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు బాలీవుడ్ నుంచి సూపర్ ఆఫర్ వచ్చింది. యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా న‌టిస్తోన్న ‘మిష‌న్ మ‌జ్ను’ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ పట్టేసింది ర‌ష్మిక.

ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది రష్మిక మందన. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పల్లెటూరు పిల్లలా రష్మిక స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వనుంది. అలాగే ఇటీవలే శర్వానంద్ హీరోగా రూపొందబోతున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాకు కూడా సంతకం చేసింది ఈ ముద్దుగుమ్మ.

తమిళ్ లో కార్తీతో కలిసి నటించిన ‘సుల్తాన్’ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. క్షణం తీరిక లేకుండా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ఆమె రెండు చేతులా సంపాదిస్తోంది. దీంతో మొన్నామధ్య లగ్జరీ కారు కొనుగోలు చేసిన రష్మిక ఇప్పుడు ఓ ఇల్లు కూడా కొందట.  బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది.

అలానే వికాస్ భల్ దర్శకత్వంలో బిగ్ బీ అమితాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘డెడ్లీ’ సినిమాలో కూడా రష్మిక ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. ఇలా బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తుండటంతో అక్కడ పాగా వేయాలని డిసైడైన రష్మిక ముంబైలో ఇల్లు కొనేసింది. దక్షిణాదితో సక్సెస్ అయిన రష్మిక.. ఇప్పుడు ముంబైకి మకాం మార్చి అక్కడ కూడా సత్తా చాటుతుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

శరవేగంగా పవన్ -క్రిష్ సినిమా షూటింగ్… స్పాట్ నుంచి లీక్ అయిన పవన్ లుక్ ..సోషల్ మీడియాలో వైరల్

Love Story movie : నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ కోసం రంగంలోకి సమంత.. మరో మాస్ బీట్ తో రానున్న ఫిదా బ్యూటీ..

Mosagallu Movie :’డబ్బు ఉన్న వాడి దగ్గర డబ్బు కొట్టేయడం తప్పేమి కాదు’..ఆకట్టుకుంటున్న మోసగాళ్లు ట్రైలర్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!