AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukumar : సినిమా పై ఉప్పెనంత ప్రేమ కురిపించిన మహేష్ బాబుకు థాంక్స్ చెప్పిన సుకుమార్..

క‌లెక్ష‌న్ల మోత మోగిస్తూ విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతుంది ఉప్పెన‌. వైష్ణ‌వ్‌తేజ్‌, కృతిశెట్టి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన ఉప్పెన అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్‌సేతుప‌తి రాయ‌న‌మ్ పాత్ర‌

Sukumar : సినిమా పై ఉప్పెనంత ప్రేమ కురిపించిన మహేష్ బాబుకు థాంక్స్ చెప్పిన సుకుమార్..
Rajeev Rayala
|

Updated on: Feb 25, 2021 | 9:38 PM

Share

Sukumar :  క‌లెక్ష‌న్ల మోత మోగిస్తూ విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతుంది ఉప్పెన‌. వైష్ణ‌వ్‌తేజ్‌, కృతిశెట్టి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన ఉప్పెన అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్‌సేతుప‌తి రాయ‌న‌మ్ పాత్ర‌లో న‌టించి సినిమాకే హైలెట్‌గా నిలిచాడు.ఇంత వరకు ఏ డెబ్యూ హీరోకి రాని వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టిస్త్నునాడు వైష్ణవ్. ఒక్క టాలీవుడ్‌ మాత్రమే కాదు.. ఒక డెబ్యూ హీరోల పేరిట బాలీవుడ్‌లో ఉన్న రికార్డ్‌ను కూడా వైష్ణవ్‌ బీట్‌ చేశాడు. విడుదలైన రెండు రోజులకే ఈ సినిమాకు ఏకంగా 18 కోట్ల షేర్ వచ్చిందంటే రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు ‘ఉప్పెన’ ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో కోలీవుడ​, బాలీవుడ్‌లోకి కూడా రీమేక్‌ చేయడానికి సన్నహాలు మొదలు పెట్టారు. ఉప్పెన సినిమా పై సెలబ్రిటీలందరు ప్రశంసలు కురిపించారు . ఉప్పెన చిత్రం చూసిన తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన భావోద్వేగాలను దాచుకోలేకపోయారు. ఈ చిత్రంపై ట్విట్టర్ లో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఉప్పెన గురించి ఒక్కమాటలో చెప్పాలంటే “క్లాసిక్” అని కొనియాడారు.

“బుచ్చిబాబు సానా… మీరు తీసిన చిత్రం అత్యంత అరుదైన.. కలకాలం నిలిచే చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇక ఉప్పెన చిత్రానికి గుండెకాయ అంటే దేవిశ్రీప్రసాద్ అనే చెప్పాలి. ఆల్ టైమ్ గ్రేట్ సంగీతాల్లో ఒకటిగా ఉప్పెన పాటలు, నేపథ్య సంగీతం నిలిచిపోతాయి. డీఎస్పీ… మీరు ఇప్పటివరకు చేసిన అన్ని చిత్రాల్లో ఇదే అత్యుత్తమం. మీరు ఇదే ఒరవడి కొనసాగించాలి” అని ఆకాంక్షించారు.

అయితే ఉప్పెన పై ప్రశంసలు కురిపించిన మహేష్ కు కృతజ్ఞతలు తెలిపారు సుకుమార్. మహేష్ బాబుకు ధన్యవాదాలు చెబుతూ ట్విటర్ లో పోస్టు చేశాడు సుకుమార్. బిజీషెడ్యూల్ కూడా పక్కన పెట్టి ఉప్పెన సినిమా చూసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేసినందుకు థాంక్స్ చెప్పాడు సుక్కూ. ‘మీతో మాట్లాడటం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది’ అని రాసుకొచ్చాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Rashmika Mandanna: బాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న రష్మిక.. ముంబైకి మకాం మార్చేస్తున్న లక్కీ బ్యూటీ..

శరవేగంగా పవన్ -క్రిష్ సినిమా షూటింగ్… స్పాట్ నుంచి లీక్ అయిన పవన్ లుక్ ..సోషల్ మీడియాలో వైరల్

Love Story movie : నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ కోసం రంగంలోకి సమంత.. మరో మాస్ బీట్ తో రానున్న ఫిదా బ్యూటీ..

Follow Us
బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప కాదు. 18 ఏళ్ల క్రితమే ఈ  మూవీ సెన్సేషన్
బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప కాదు. 18 ఏళ్ల క్రితమే ఈ  మూవీ సెన్సేషన్
ఫాదర్స్ మంచి టీచర్స్ కాలేరు: అభిషేక్ బచ్చన్
ఫాదర్స్ మంచి టీచర్స్ కాలేరు: అభిషేక్ బచ్చన్
కళ్లు చెదిరే లగ్జరీ విల్లా లో స్టార్ ఫ్యామిలీ
కళ్లు చెదిరే లగ్జరీ విల్లా లో స్టార్ ఫ్యామిలీ
వాకింగ్‌.. ఎప్పుడు చేస్తే మంచిది? మార్నింగ్ వాక్ vs ఈవెనింగ్ వాక్
వాకింగ్‌.. ఎప్పుడు చేస్తే మంచిది? మార్నింగ్ వాక్ vs ఈవెనింగ్ వాక్
శరీరానికి చల్లదనం ఇచ్చే పెసర లడ్డూ.. టేస్ట్‌తో పాటు హెల్త్ కూడా..
శరీరానికి చల్లదనం ఇచ్చే పెసర లడ్డూ.. టేస్ట్‌తో పాటు హెల్త్ కూడా..
వేడి నీళ్లు vs చల్లటి నీళ్లు.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వేడి నీళ్లు vs చల్లటి నీళ్లు.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మీ వద్దకే..
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మీ వద్దకే..
9ఏళ్ల దాహాన్ని తీర్చుకుంటూ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసిన వాషింగ్టన్
9ఏళ్ల దాహాన్ని తీర్చుకుంటూ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసిన వాషింగ్టన్
నమ్మరుగానీ,ఈ నల్లటి విత్తనాలు సర్వరోగ నివారణి.. ఆరోగ్య ప్రయోజనాలు
నమ్మరుగానీ,ఈ నల్లటి విత్తనాలు సర్వరోగ నివారణి.. ఆరోగ్య ప్రయోజనాలు
పిల్లాడి వైద్యం ఒక్క మెసేజ్ చేస్తే ఆయన స్పందించిన విధానం అద్భుతం.
పిల్లాడి వైద్యం ఒక్క మెసేజ్ చేస్తే ఆయన స్పందించిన విధానం అద్భుతం.