Gangubai Kathiawadi : ‘గంగూబాయి కతియావాడి’ కోసం ముందుగా ఆ బ్యూటీ అనుకున్నారట.. కానీ ఆమె నో అనడంతో..

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో ఆలియా భట్ తొలిసారి నటిస్తున్న సినిమా.. ‘గంగూబాయికతియావాడీ. అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

  • Rajeev Rayala
  • Publish Date - 6:00 pm, Thu, 25 February 21
Gangubai Kathiawadi : 'గంగూబాయి కతియావాడి' కోసం ముందుగా ఆ బ్యూటీ అనుకున్నారట.. కానీ ఆమె నో అనడంతో..

Gangubai Kathiawadi : ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో ఆలియా భట్ తొలిసారి నటిస్తున్న సినిమా.. ‘గంగూబాయికతియావాడీ. అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ కు విషెష్ స్పందన వస్తుంది. యంగ్ బ్యూటీ అలియా భట్ మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. అసలు ఇంతకు ఈ గంగూభాయ్ ఎవరో తెలుసా..

గంగూబాయి.. అండర్‌వరల్డ్‌ సహాయంతో ముంబైలోని కామతిపూరలో పలు వేశ్యాగృహాలు నడిపేది. దీంతో ఆమెకు ‘మేడమ్ ఆఫ్ కామతిపుర’ అనే పేరు వచ్చింది. అసలు గంగూబాయి ఎలా ముంబైలో అడుగుపెట్టిందంటే..తెలిసి తెలియని వయసులో ఓ వ్యక్తిని ఇష్టపడి అతడిని గుడ్డిగా నమ్మి ఇంట్లో నుండి పారిపోయింది గంగూబాయి. ఆమె అయామకత్వాన్ని అలుసుగా తీసుకున్న ఆమె ప్రియుడు, గంగూబాయిని ట్రాప్ చేసి కామతిపురలోని ఓ వేశ్యాగృహంలో అమ్మేశాడు. అనుకోకుండా ఆ వలలో చిక్కుకున్న గంగూబాయి. మెల్లగా ఆ వృత్తిపై పట్టు సాధించి, ముంబై అండర్‌వరల్డ్‌ సహాయంతో సొంతంగా తనే వేశ్యాగృహాలు నడుపుతూ ‘మేడమ్ ఆఫ్ కామతిపుర’ గా ఎదిగింది.

ఆతర్వాత కామతిపురలో జీవన పరిస్థితులను మెరుగుపర్చడానికి ఆమె చేసిన ప్రయత్నాల కారణంగా అక్కడి ప్రజల్లో గంగూబాయి పట్ల ఓ గౌరవం ఏర్పడింది. ఆమె విగ్రహాలు మరియు ఫోటోలు ఈ ప్రాంతంలోని ఇళ్లలో కనిపించేవి.. స్థానికులు ఆమె గౌరవార్థం స్థానికంగా ఒక విగ్రహాన్ని కూడా నిర్మించారు. ఓ వేశ్య అందర్నీ శాసించే నాయకురాలిగా ఎలా మారిందనేది సినిమా ప్రధానాంశంగా దర్శకుడు సంజయ్ బన్సాలి సినిమాను తెరకెక్కించారు. అయితే ముందుగా ఈ చిత్రంలో అలియా భట్‌ను సంజయ్ లీలా భన్సాలీ ఎంపిక చేయలేదట. సంజయ్ లీలా భన్సాలీ అలియాకు బదులుగా గంగూబాయి కతియావాడి కోసం రాణి ముఖర్జీ, ప్రియాంక చోప్రా లతో తెరకెక్కించాలనుకున్నాడట. ప్రియాంక లేదా రాణి గంగూబాయి పాత్రను చాలా బాగా పోషించగలరని భన్సాలీ అభిప్రాయపడ్డారట. ఇందుకోసం భన్సాలీ ప్రియాంకతో కూడా చర్చించారు.

ప్రియాంక హాలీవుడ్ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉండటంతో గంగూబాయి కతియావాడిని సున్నితంగా తిరస్కరించిందట. అయితే ఆతర్వాత ప్రియాంక భన్సాలీకి రాణి ముఖర్జీ పేరు సూచించిందట. అయితే రాణీముఖర్జీ కూడా ఆనుకొని కారణాల వల్ల ఈ సినిమా చేయలేనని చెప్పేసిందట దాంతో ఈసినిమాలో అలియా ఎంట్రీ ఇచ్చింది.
ఇక ఈ సినిమా జులై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే అదే సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ కు బాహుబలి, సాహో సినిమాలతో హిందీలో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటింస్తున్న పూజాహెగ్డే కూడా హిందీలో పలు సినిమాలు చేసింది. ఇక ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతుండటం ఆసక్తిని కలిగిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

డిజిటల్ మీడియా, ఓటీటీపై కేంద్రం కళ్లెం.. హద్దుమీరితే కఠిన చర్యలు.. పిల్లలు చూడకుండా నియంత్రణ.. ఫోటో స్టోరీ

Check Movie : రిలీజ్‌కు రెడీ అవుతున్న నితిన్ ‘చెక్’ మూవీ.. వెరైటీగా విషెస్ తెలిపిన ‘రంగ్ దే’ టీమ్..

Priyanka Chopra : ప్రియాంకా చోప్రను ట్రోల్ చేస్తున్న నెటిజనులు.. థ్యాంక్స్ చెప్పి షాక్ ఇచ్చిన గోబల్ బ్యూటీ.. ఇంతకు ఏమైందంటే..

ఘనంగా డైరెక్టర్ సుకుమార్ కూతురి ఫంక్షన్.. సందడి చేసిన టాలీవుడ్ స్టార్ కపుల్స్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..