AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thala Ajith : హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టిన స్టార్ హీరో.. వైరల్ అవుతున్న అజిత్ సైక్లింగ్ పిక్స్ ..

తమిళ సినీ పరిశ్రమలో హీరో అజిత్‌ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ హీరోగా అభిమానులు అలరించే సినిమాలు చేస్తూ బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారాయన.

Thala Ajith : హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టిన స్టార్ హీరో.. వైరల్ అవుతున్న అజిత్ సైక్లింగ్ పిక్స్ ..
Rajeev Rayala
|

Updated on: Feb 25, 2021 | 10:32 PM

Share

Thala Ajith : తమిళ సినీ పరిశ్రమలో హీరో అజిత్‌ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ హీరోగా అభిమానులు అలరించే సినిమాలు చేస్తూ బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారాయన. అయితే కెరీర్ తొలినాళ్లలో అజిత్ ఎన్నో ప్రేమకథా చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. తెలుగులోకి డబ్ అయిన ‘ప్రేమలేఖ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు అజిత్ నటించిన అన్ని సినిమాలో తెలుగులోకూడా డబ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. తల’ అజిత్ కుమార్ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల అజిత్ హైదరాబాద్‌లో కెమెరా కంట పడ్డారు. క్లీన్ షేవ్‌తో సరికొత్తగా ఉన్న తల పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. అజిత్ కు హైద‌రాబాద్‌తో ఎంతో అనుబంధం ఉంద‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అజిత్ హైద‌రాబాద్‌లోనే పుట్టి పెరిగాడు. హీరో కాకముందు హైదరాబాద్ లోనే బైక్ మెకానిక్ గా ప‌నిచేశాడు. త‌న‌కు వీలు దొరికిన‌ప్పుడ‌ల్లా హైద‌రాబాద్‌కు వ‌చ్చి వెళ్తుంటాడు.

ఇటీవలే బైక్ వేసుకొని దేశంలోని ముఖ్యమైన ప్రాంతాలను చుట్టేసి వచ్చాడు అజిత్. ఈ జర్నీలో కంటిన్యూస్ గా 10 వేల కిలోమీటర్లు తిరిగేసి వచ్చాడు. తాజాగా.. హైదరాబాద్ లో రోడ్డుపై సైక్లింగ్ చేశాడు అజిత్. శంషాబాద్ విమానాశ్రయం నుండి మెహదీపట్నం వరకు తిరిగి అరమ్ఘర్ చౌరాస్తా మీదుగా రామోజీ ఫిలిం సిటీ వరకు సైకిల్ తొక్కాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో అజిత్ లేటెస్ట్ మూవీ ‘వాలిమై’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌కుండా ఉండేలా బ్లాక్ ఔట్‌ఫిట్‌లో ఉన్న అజిత్ ఫేస్‌ను క‌వ‌ర్ చేస్తూ..సైక్లింగ్ చేశాడు. అయితే అజిత్ తో రైడ్ చేసిన వ్య‌క్తులు తీసిన‌ ఫొటోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అవుతున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

శరవేగంగా పవన్ -క్రిష్ సినిమా షూటింగ్… స్పాట్ నుంచి లీక్ అయిన పవన్ లుక్ ..సోషల్ మీడియాలో వైరల్

Drishyam 2 : ‘దృశ్యం 2’ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకీ కథలో మార్పులు చేస్తున్న దర్శకుడు జీతు జోసెఫ్..

జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!