నవ్వించే ఈ బుడ్డోడు.. తక్కువోడేం కాదు.. నైజీరియాలో పెద్ద తురుము.. ! మీమ్స్‌తో అదరగొడుతున్న ఒసిటా ఇహెమ్..
Osita Ihem Life Story : కొందరి ఫేస్ చూస్తేనే చాలు.. లాఫింగ్ గ్యాస్ లేకున్నా, నవ్వు దానంతటే అదే వస్తుంది.. వారి బొమ్మ చూస్తేనే అటోమెటిక్‌గా ఏదో రిలాక్సింగ్ ఫీల్

Osita Ihem Life Story : కొందరి ఫేస్ చూస్తేనే చాలు.. లాఫింగ్ గ్యాస్ లేకున్నా, నవ్వు దానంతటే అదే వస్తుంది.. వారి బొమ్మ చూస్తేనే అటోమెటిక్‌గా ఏదో రిలాక్సింగ్ ఫీల్ వస్తుంది. వారి ఎక్స్‌ప్రెషన్స్‌తోనే కడుపుబ్బా నవ్విస్తారు.. తెలుగులో బ్రహ్మనందం, తమిళంలో వడివేలు, హిందీలో జానీలివర్లాగా.. హలీవుడ్లోనూ, మిగతా ప్రపంచ భాష సినిమాల్లోనూ ఇలా ఎంతోమంది కమెడియన్లు తమ ఫ్యాన్స్‌ను నవ్విస్తూ అలరిస్తూ ఉంటారు. మూడీగా ఉండే జనాలకు నవ్వుల మత్తును అందిస్తారు. బాధలో ఉన్న వారికి తమ హాస్యంతో ఆ బాధను దూరం చేస్తారు. కలకలం ప్రేక్షకుల హృదయాల్లో కొలువై ఉంటారు. అలాంటి మొహమే.. ఈ మధ్య మన తెలుగులోకి ‘మీమ్స్’తో తో పాటు వీడియోల రూపంలో వస్తోంది. కడుపుబ్బా నవ్విస్తున్నాడు ఈ చిన్నోడు.. ఎక్కడివాడో ఈ బుడ్డోడు భలే గున్నాడే.. అనుకుంటూ మనం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ అల్లరి గడుగ్గాయి.. బుడ్డోడు కాదు.. పెద్దోడే.. చూడ్డానికి 12ఏండ్ల పిల్లగాడిల కనిపించే నవ్వించే బుడతడి వయస్సు 38సంవత్సరాలు.. ఇతడి గురించి పెద్ద స్టోరే ఉంది.. అతడి గొప్పతనమెంటో తెలుసుకుందాం..
మీమ్స్ కింగ్ పేరు ఒసిటా ఇహెమ్. 1982 ఫిబ్రవరి 20 న నైజీరియాలోని ఇమో స్టేట్‌లోని ఎంబైటోలిలో పుట్టాడు. అబియా స్టేట్‌లో పెరిగాడు. లాగోస్ స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చదివాడు. ఒసిటా ఇప్పటికీ 38ఏండ్లు ఉన్నా పొట్టిగా ఉండడమే అతడికి ప్లస్ అయ్యింది. టాప్ మోస్ట్ కమెడియన్‌గా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను తెచ్చిపెట్టింది. ఒసిటా యాక్టింగ్ తొలినాళ్లలో చాలానే కష్టపడ్డాడు. అయితే 2003 లో అతను అకినా ఉక్వా అనే హాస్య చిత్రంలో చినేడు ఇకెడీజ్ అనే లేడీ కమెడియన్‌తో కలిసి నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇందులో అతను పావ్‌పా పాత్ర పోషించాడు. ఈ పాత్రలో ఒసిటా ఒక కొంటె(మన భాషలో తీట) పిల్లాడి పాత్ర పోషించాడు. ఇది బాగా ఫేమస్ అవ్వడంతో తర్వాత ఎన్నో చిత్రాల్లో చిన్నపిల్లాడి పాత్రలనే పోషించాడు. చినేడు ఇకెడీజ్, ఒసిటాలు నాలీవుడ్(నైజీరియా సినిమా)లో బెస్ట్ కమెడియన్ పేయిర్‌గా పేరుగడించారు. మన రాజబాబు–రమాప్రభ, బ్రహ్మనందం–శ్రీలక్ష్మిలాగా అన్నమాట..
నైజీరియా ప్రముఖ నటుడిగా పేరుపొందిన ఒసిటా ఇహెమ్ను ఎన్నో అవార్డులు వరించాయి. 2011 లో నైజీరియాలో ప్రముఖమైన ‘‘ఆర్డర్ ఆఫ్ ది ఫెడరల్ రిపబ్లిక్ పురస్కారం’’తో అధ్యక్షుడు గుడ్‌లక్ జోనాథన్ సత్కరించారు. తాజాగా ఆఫ్రికన్ మూవీ అకాడమీ అవార్డులలో ఇహేమ్ లైఫ్ టైం ఎఛీవ్మెంట్ అవార్డు అందుకున్నాడు. ఇప్పుడదే వరల్డ్ వైడ్ వైరల్ అవుతోంది. హాస్యనటుడిగా ఎంతో పేరుపొందిన ఒసిటా ‘INSPIRED 101’ అనే పుస్తకాన్ని రాశాడు. నల్లగా పుట్టాం, పొట్టిగా ఉన్నాం.. అని తెగ బాధపడిపోయే వాళ్లకు ఇతడి జీవితం ఇన్సిపిరేషన్ అవుతుందడనంలో సందేహం లేదు. ఇతడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్, డిఫరెంట్ యాక్షన్‌తో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అందుకే కంటెంట్ ఉన్నోడికి కటౌట్ తో పనిలేదు బ్రో.. అంటూ ఒసిటా నిరూపిస్తున్నాడు. మీరు ఎంత బాధలో ఉన్నాసరే.. ఒకసారి ఒసిటా ఉన్న మీమ్స్నో, వీడియోనో చూడండి.. వెంటనే మీరు రీఫ్రెష్ అవుతారు. ‘‘జీతం వచ్చిన మొదటి రోజు మనిషి ఎంత ఆనందంగా ఉంటాడో.. రెండు రోజులకే జీతం మొత్తం అయిపోతే మనిషి ఎలా ఉంటాడో.. ’’ఒసిటా చేసిన వీడియో ఒకటి ఉంటుంది.. చూస్తే నవ్వి నవ్వి పొట్టపట్టుకోవడం ఖాయం.
విశాఖ రౌడీ షీటర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్.. అసలు నిందితుడు ఎవరో కాదు..