Tandav Effect: తాండవ్ వెబ్ సిరీస్ వివాదం.. అమెజాన్ ప్రైమ్ వీడియో కంటెంట్ చీఫ్ అపర్ణ పురోహిత్‌కు షాక్ ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు..

Tandav Effect: అమెజాన్ ప్రైమ్ వీడియో, తాండవ్ వెబ్ సిరీస్‌ తాండవ్ నిర్మాతకు అలహాబాద్ ఐకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అమెజాన్..

Tandav Effect: తాండవ్ వెబ్ సిరీస్ వివాదం.. అమెజాన్ ప్రైమ్ వీడియో కంటెంట్ చీఫ్ అపర్ణ పురోహిత్‌కు షాక్ ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 26, 2021 | 10:22 AM

Tandav Effect: అమెజాన్ ప్రైమ్ వీడియో, తాండవ్ వెబ్ సిరీస్‌ తాండవ్ నిర్మాతకు అలహాబాద్ ఐకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అమెజాన్ ప్రైమ్ వీడియో కంటెంట్ చీఫ్ అపర్ణ పురోహిత్‌కు బెయిల్‌ను ధర్మాసనం నిరాకరించింది. తాండవ్ వెబ్‌ సిరీస్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో పురోహిత్, తాండవ్ దర్శకుడు అలీ అబ్బాస్, నిర్మాత హిమాన్షు కృష్ణ మెహర్, రచయిత గౌరవ్ సోలంకిపై దేశ వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు అయ్యాయి. జనవరి 18 న హజ్రత్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ అమర్‌నాథ్ వర్మ వారిపై కేసు నమోదు చేయగా.. ఆ తరువాత యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్‌లోనూ పురోహిత్, ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులోనే వీరికి ముందస్తు బెయిల్‌ను హైకోర్టు నిరాకరించింది. కాగా, హైకోర్టులో విచారణకు ముందు.. అపర్ణ పురోహిత్‌ను ముంబై పోలీసులు హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నించారు. న్యాయవాదుల సమక్షంలో దాదాపు 100 ప్రశ్నలు సంధించినట్లు అధికారిక వర్గాల సమాచారం. తాండవ్ వెబ్ సిరీస్‌కు సంబంధించిన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని డిప్యూటీ పోలీస్ కమిషనర్ సోమెన్ బారా వెల్లడించారు. కాగా, ఈ కేసులో పురోహిత్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని అలహాబాద్ హైకోర్టు గతంలోనే ఆదేశించింది.

తాండవ్ వివాదం: సైఫ్ అలీ ఖాన్, డింపుల్ కపాడియా, జీషన్ అయూబ్ తదితరులు నటించిన తాండవ్ వెబ్ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. ఆ సిరీస్‌లోని కొన్ని సన్నివేశాలు హిందూమతస్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొన్ని హిందూ సంస్థలు, రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వెబ్ సిరీస్‌ను నిషేధించాలంటూ దేశ వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పోలీస్ స్టేషన్లలో పలువురు ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఉత్తర ప్రదేశ్‌లో ఫిర్యాదులు భారీగా వెల్లువెత్తాయి. ‘హిందూ దేవతలను కించపరిచేలా వెబ్ సిరీస్‌ను తీశారు. అందులో దేవతామూర్తుల వస్త్రధారణ అభ్యంతరకరంగా ఉంది’ అంటూ ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులో అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇక ఈ ఉదంతంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించడంతో.. వివాదం మరింత ముదిరింది. చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించడంతో పరిస్థితులు ఒక్కసారిగా హీటెక్కాయి. అయితే, వెబ్ సిరీస్ నిర్మాత అయిన అలీ అబ్బాస్ జాఫర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. అంతేకాదు..వెబ్ సిరీస్‌ నుంచి అభ్యంతరకర సన్నివేశాలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

ఇదిలాుంటే.. తాండవ్ వెబ్‌సిరీస్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాపత్ంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. హిందూ సంస్థలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. రాజకీయ నాయకులు సైతం ఈ వెబ్ సిరీస్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఉత్తర ప్రదేశ్‌లో, గ్రేటర్ నోయిడా, షాజహన్‌పూర్, గౌతమ్ బుద్ధ నగర్, లక్నోలలో భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

Also read:

Bharat Bandh Today: నేడు భారత్ బంద్.. దేశవ్యాప్తంగా పాల్గొననున్న 40వేల వాణిజ్య సంఘాలు

ఇరాన్‌లో అమానుషం.. హంతకురాలు చనిపోయినా వదల్లేదు.. శవాన్ని సైతం ఉరితీశారు!