Crime News Iran: ఇరాన్‌లో అమానుషం.. హంతకురాలు చనిపోయినా వదల్లేదు.. శవాన్ని సైతం ఉరితీశారు!

Convicted Woman Deceased: ఆమె ఓ హంతకురాలు. భర్తను చంపిన కేసులో ఉరిశిక్ష పడింది. ఉరికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఉరికంబం ఎక్కే క్రమంలో...

Crime News Iran: ఇరాన్‌లో అమానుషం.. హంతకురాలు చనిపోయినా వదల్లేదు.. శవాన్ని సైతం ఉరితీశారు!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 26, 2021 | 2:02 PM

Iran Crime News: విదేశాల్లో నేరాలు చేస్తే చిత్ర విచిత్రమైన శిక్షలు విధిస్తారని వింటూనే ఉంటాం. ఇక అలాంటిదే ఒకటి ఇప్పుడు చెప్పబోతున్నాం. హంతకురాలు చనిపోయిందని తెలిసినా.. ఆమె మృతదేహాన్ని ఉరితీశారు. ఈ ఘటన ఇరాన్‌లో జరిగింది. అసలు దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆమె ఓ హంతకురాలు. భర్తను చంపిన కేసులో ఉరిశిక్ష పడింది. ఉరికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఉరికంబం ఎక్కే క్రమంలో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. అయినప్పటికీ ఆమె మృతదేహాన్ని ఉరికి వేలాడదీసి శిక్ష అమలు చేశారు. ఈ అమానుష ఘటన ఇరాన్‌లో చోటుచేసుకుంది. జహ్రా ఇస్మాయిలీ(Jafra Ismail) అనే మహిళ భర్తను చంపిన నేరానికి జైలుపాలైంది. ఆమె హత్య చేసినట్టు నిరూపితం కావడంతో కోర్టు మరణశిక్ష(Death Sentence) విధించింది. ఆమె భర్త ఇరాన్ ఇంటెలిజెన్స్ శాఖలో అధికారి. తనను, కుమార్తెను దూషిస్తుండడంతో జహ్రా ఇస్మాయిలీ భర్తను హత్య చేసింది. (Iran Crime News)

ఇదిలా ఉంటే జహ్రా కంటే ముందు 16 మంది దోషులను ఉరితీశారు. తన ముందే వారందరూ విలవిల్లాడుతూ మరణించడం ఆమె కళ్లారా చూసింది. గుండె పగిలి కుప్పకూలిపోయింది. అయినప్పటికీ తన మృతదేహాన్ని ఉరికంబం ఎక్కించారు. జహ్రా మృతదేహాన్ని వేలాడదీశారు. అయితే, ఆమె అత్త మాత్రం తన కుమారుడిని చంపిన కోడలిపై కసితో రగిలిపోయింది. జహ్రా చనిపోయినప్పటికీ ఆమె కూర్చున్న కుర్చీని తన అత్తగారు తన్నేయడంతో ఉరితీత పూర్తయింది. ఇరాన్‌(Iran)లో ఉరిశిక్ష పడిన దోషుల ఉరితీతలో పాల్గొనేందుకు బాధితుల బంధువులను అనుమతిస్తారు. ఉరికంబం దగ్గర దోషులు కూర్చున్న కుర్చీని తన్నేసే హక్కు వారికి లభిస్తుంది. తద్వారా తమకు న్యాయం జరిగిందన్న భావనతో పాటు, తమ చేతులతోనే దోషిని చంపామన్న తృప్తి కూడా లభిస్తుంది. (Crime News Iran)

(Convicted Woman Deceased Of Heart Attack Body Hanged Iran)

మరిన్ని ఇక్కడ చదవండి:

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!

Fight With Cheetah: చావు తప్పదనుకుని.. చిరుతతో ఫైట్‌ చేసిన రియల్‌ హీరో.. చివరికి ఏమైందంటే.!

ఈ వింత షార్క్ పిల్ల.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌ అట.! నిజంగానే కోట్లు తెచ్చిపెడుతుందా.?