Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మయన్మార్​ హింసాత్మక ఘటనలపై తీవ్రంగా స్పందించిన ఫేస్‌బుక్.. మిలటరీ ఖాతాలపై నిషేధం..!

మయన్మార్‌లో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో దేశంలోని అక్కడి సైనిక సంబంధిత ఫేస్ బుక్ ఖాతాలను బ్లాక్ చేశారు.

మయన్మార్​ హింసాత్మక ఘటనలపై తీవ్రంగా స్పందించిన ఫేస్‌బుక్.. మిలటరీ ఖాతాలపై నిషేధం..!
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 26, 2021 | 6:55 AM

Myanmar : మయన్మార్‌లో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో దేశంలోని అక్కడి సైనిక సంబంధిత ఫేస్ బుక్ ఖాతాలను బ్లాక్ చేశారు. ఈ మేరకు ఫేస్‌బుక్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ఇన్వెస్టిగేటర్లు ఫేస్‌బుక్ లో ద్వేషపూరితమైన ప్రచారం జరుగుతుందని.. దీని కారణంగా హింసకు ప్రేరేపితంగా అవుతుందని పేర్కొన్నారు. దేశంలో తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడం కాస్త ఆలస్యమైందంటూ ఫేస్ బుక్ కంపెనీ వెల్లడించింది.

కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ సంక్షోభంతో ప్రభుత్వం రద్దు అయింది. ఆ రద్దయిన ప్రభుత్వం కూడా ఫేస్ బుక్ ద్వారా తమ నిర్ణయాలను వెల్లడించింది. సైన్యంపై వ్యతిరేకత ప్రబలకూడదనే ముందుచూపుతో ఫేస్‌బుక్ బ్లాక్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మయన్మార్‌లో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొనడంతో అక్కడి సైనిక సంబంధిత ఖాతాలను తొలగిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఫిబ్రవరి 1న మయన్మార్‌లో సైనిక పాలన ప్రకటించినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలపై ఫేస్‌బుక్‌ తీవ్రంగా స్పందించింది. తమ సంస్థ నిబంధనలను తరచూ ఉల్లంఘిస్తుండంటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదంటూ వారు ఆ ప్రకటనలో తెలిపారు.

ఇక, ఇప్పటికే మయన్మార్‌ మిలటరీకి చెందిన పలు ఖాతాలు, పేజీలను నిషేధించిన ఫేస్‌బుక్‌ తాజాగా అన్ని మిలటరీ సంబంధ ఖాతాలు, మిలటరీ ఆధ్వర్యంలో నడిచే సంస్థల ప్రకటనలు, ఇన్‌స్టాగ్రాం ఖాతాలను తొలగించింది. కొద్దిరోజుల క్రితం సైనిక పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారిన ఘటనలో మయన్మార్‌ మిలిటరీ అధికారిక పేజీని తొలగించినట్లు ఫేస్‌బుక్‌ గతంలో తెలిపింది.

మయన్మార్‌లో ఆన్‌లైన్‌ వేదికగా మిలిటరీ విద్వేష ప్రచారాల్ని నియంత్రించడంతో ఫేస్‌బుక్‌, ఇతర సామాజిక మాధ్యమాలపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్వేష ప్రచారాల్ని అడ్డుకొనేందుకు గత కొన్ని సంవత్సరాలుగా ఫేస్‌బుక్‌ ఆ దేశంలోని పౌరహక్కుల సంఘాలు, ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి పనిచేస్తోంది. 2017లో పలు మిలటరీ అధికారుల ఖాతాల్ని ఫేస్‌బుక్‌ తొలగించింది.

ఫిబ్రవరి 1న మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. తదనంతరం దేశంలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆతర్వాత ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించారు. కానీ, ప్రజలు, రాజకీయపార్టీల నేతలు, కార్యకర్తలు ఫేస్‌బుక్‌, ఇతర మాధ్యమాల్లో నిరసన వ్యక్తం చేశారు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాంలను నిషేధిస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. తాజాగా మిలటరీకి సంబంధించి అన్ని అకౌంట్లను తొలగిస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది.

మరోవైపు, సైనిక తిరుగుబాటు తర్వాత ఇప్పటికే ప్రముఖ మయవాడి టీవీ, టెలివిజన్​ బ్రాడ్​కాస్టర్​ ఎంఆర్​టీవీ సహా.. సైన్యానికి అనుసంధానమైన పలు ఖాతాలపై నిషేధం విధించింది. అంతేకాకుండా ఫేస్​బుక్​ యాజమాన్యంలో ఉన్న ‘ఇన్​స్టాగ్రామ్​’లోనూ ఈ నిషేధాజ్ఞలు వర్తింపజేసింది.

ఆంగ్​ సూకీ ప్రభుత్వంతో పాటు ఆమె నేషనల్​ లీగ్​ ఫర్​ డెమోక్రసీ పార్టీని బహిష్కరించినుందుకు కొందరు సైనికాధికారుల ఖాతాలపై 2018లోనే నిషేధం విధించింది ఫేస్​బుక్​. అప్పట్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సీనియర్​ జనరల్​ మిన్​ ఆంగ్​ హేలింగ్​.. ప్రస్తుతం సైనిక ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.

ఇదీ చదవండిః ప్రాణం తీసిన ఊపిరితిత్తుల మార్పిడి.. ప్రపంచంలోనే తొలి అవయవ మార్పిడి కరోనా మృతిగా చెబుతున్న అధికారులు..